Friday, November 6, 2026 05:45 PM
Friday, November 6, 2026 05:45 PM

అసెంబ్లీ కంటే ఘోరం.. నెక్ట్స్ ఏంటి..?

ఏపీలో మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పరిస్థితి మరోసారి తేలిపోయింది. కూటమి పార్టీల అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచారు. అనంతపురం మేయర్ ఎన్నికలో మాత్రం వైసీపీ అభ్యర్థి రమేశ్ గౌడ్ 6 వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఓ వైపు మాకు తిరుగు లేదు.. బ్యాలెట్ ఎన్నికలో తమదే పై చెయ్యి అని గొప్పగా చెప్పుకున్న వైసీపీ నేతలకు ఈ ఎన్నికల ఫలితాలు దిమ్మ తిరిగేలా చేశాయి. ఓడిన తర్వాత.. మేము ప్రజల హృదయాలు గెలిచాం.. కూటమి ప్రభుత్వం దాడులు చేసింది.. అంటూ మెట్ట వేదాంతం చెబుతున్నారు కూడా.

Also Read : నార్త్ మార్కెట్ లోనూ ప్రభాస్ దే డామినేషన్..!

ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. స్థానిక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ నుంచి కూడా వైసీపీకి గట్టి పోటీ ఎదురైంది. ప్రశాంతంగా ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం కనిపించలేదు. కీలక నేతల వారసులు కూడా ఓడిపోవడం, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత చిన్నమ్మ కూడా గెలవకపోవడంతో వైసీపీ గ్రాఫ్ మరింత పడిపోయిందనే అభిప్రాయం సొంత పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతోంది. వైసీపీ పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా ఘోరమా?.. అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు.

స్థానిక ఎన్నికలకు సంబంధించిన ఫలితం దాదాపు వచ్చేసింది. పట్టణ ఓటర్లు వైసీపీని దూరం పెట్టారు. దీనిలో ఏమాత్రం పెద్దగా ఓటు బ్యాంకు కూడా లేని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వారికి కూడా వచ్చిన ఓట్లు వైసీపీ అభ్యర్థులకు కొన్ని కొన్ని చోట్ల పడలేదన్నది వాస్తవం. ఇక, కేవలం 2 శాతం లోపు ఓటు బ్యాంకు మాత్రమే ఉన్న బీజేపీ కూడా వైసీపీ కంటే కూడా చాలా బెటర్ అనే రేంజ్‌లోనే ఉంది. ఒకరకంగా చెప్పాలంటే.. బీజేపీకి వచ్చిన స్థానాలతో పోల్చుకుంటే.. వైసీపీకి ఒక స్థానం తక్కువగానే వచ్చింది. ఈ పరిణామాలను తేలికగానో.. లేక.. కూటమి సర్కారు ఏదో చేసిందనో అనుకుంటే వైసీపీకి మొత్తానికే మోసం జరిగే అవకాశం ఉంటుందనేది విశ్లేషకుల మాట.

క్షేత్రస్థాయిలో నామినేషన్ల ఘట్టంలో కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనిని ఎవరూ కాదనరు. కానీ, ప్రశాంతంగా నామినేషన్లు, ప్రచారం, ఎన్నిక కూడా జరిగిన ఉత్తరాంధ్ర, విజయవాడ, పశ్చిమ గోదావరి వంటి జిల్లాల్లో కూడా వైసీపీ పరిస్థితి దయనీయంగా మారింది, ఒకప్పుడు చొక్కా ఎగరేసిన శ్రీకాకుళం వంటి జిల్లాల్లో కూడా కీలక నాయకులు అదుపు తప్పారు, పార్టీ చెప్పింది ఒకటైతే.. అంతర్గతంగా చేసుకున్నది మరొకటి. అయితే.. ఎక్కడా కూడా వైసీపీ పుంజుకున్న పరిస్థితి కనిపించలేదు.

Also Read : అనంతపురంలో ఏం జరుగుతోంది.. బాబు ఫైర్..!

నిజానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. దీనిపై చాలా మంది టీడీపీ నేతలు, కార్యకర్తలే అప్పుడు అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు భయపడాలి.. పోరాడుదాం.. ఏమైతే అది అయ్యింది.. అనే మాటలు బాగా వినిపించాయి. చివరికి కొన్ని చోట్ల పార్టీ నేతలు స్వచ్ఛందంగా పోటీ చేసి విజయం సాధించారు కూడా. కానీ ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే.. వైసీపీ నేతలకు వైఎస్ జగన్ టార్గెట్ పెట్టారు. ఏది ఏమైనా సరే.. పోటీ చేయాల్సిందే అన్నారు. కానీ నేతలు, కార్యకర్తలు మాత్రం.. ఎందుకు ఇంత రిస్క్ అని అప్పుడే వ్యాఖ్యానించారు. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత అయితే.. మేము నిలబడేది లేదని చెప్పినా కూడా.. నేతల బలవంతంతో పోటీ చేశాం.. డబ్బులు పోయాయి.. మీరు ఆలోచించుకోండి.. అంటూ సొంత పార్టీ నేతల పైనే విమర్శలు చేస్తున్నారు. దీంతో అసెంబ్లీ కంటే ఘోరంగా ఉన్న వైసీపీ పరిస్థితి నెక్ట్స్ ఏంటి..? అనే మాట బాగా వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఓటర్లకు ఈసీ బిగ్...

ఓటర్ల జాబితా నుంచి పేర్లు గల్లంతైన...

అనంతపురంలో ఏం జరుగుతోంది.....

తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా భావించే అనంతపురం...

పోలవరం ఇప్పట్లో కష్టమేనా..?...

ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు...

గుంటూరులో అర్ధరాత్రి హైడ్రామా.....

గుంటూరు సమీపంలోని నల్లపాడు వద్ద స్థానిక...

ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసు.....

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1...

రెబల్స్ దెబ్బ.. మరి...

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ఘట్టం...

పోల్స్