Friday, November 6, 2026 07:40 AM
Friday, November 6, 2026 07:40 AM

రెబల్స్ దెబ్బ.. మరి వారి సంగతేంటి సార్..!

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ఘట్టం ముగియగా, మరో ఘట్టం తుది దశకు చేరుకుంది. ఎన్నికల్లో విజయాలు సాధించిన ఉత్సాహంలో కూటమి నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో టికెట్లు ఆశించి భంగపడినవారు, మిత్రపక్షాల కోసం పోటీ నుంచి తప్పుకున్నవారు, రెబల్స్ పోటీతో ఓటమి చవిచూసిన అభ్యర్థుల భవిష్యత్తుపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. మిత్రధర్మం కోసం త్యాగాలు చేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చి న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించడం ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తుండగా.. తిరుగుబాటు అభ్యర్థుల కారణంగా ఓడిపోయిన కూటమి నేతల సంగతేంటన్న ప్రశ్నలు మరోవైపు వినిపిస్తున్నాయి.

Also Read : ఇది కదా కావాల్సింది.. సుధారెడ్డి ధైర్యానికి వైసీపీ షాక్..!

ఇటీవల నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో కార్య కర్తలు, నాయకులతో మాట్లాడిన చంద్రబాబు.. కూటమి ధర్మం కోసం తమ నియోజకవర్గాల్లో టికెట్లు వదులుకున్న వారికి నామినేటెడ్ పదవుల ద్వారా తగిన గుర్తింపు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అయితే ఈ ప్రకటనతో పార్టీ శ్రేణుల్లో మరో చర్చ మొదలైంది. మిత్రపక్షాలకు అవకాశం కల్పించేందుకు పోటీ నుంచి తప్పుకున్న వారికి పదవులు ఇవ్వడం సమంజనమేనని, అదే సమయంలో పార్టీ నిర్ణయాన్ని గౌరవించి బరిలోకి దిగి రెబల్స్ కారణంగా ఓటమి పాలైన అభ్యర్థులకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. పార్టీ కోసం ఆర్ధికంగా, రాజకీయంగా శ్రమించి చివరకు పరాజయం పాలైన వారి పరిస్థితిని కూడా నాయకత్వం పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.

స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేనతో పాటు ఇతర పార్టీల్లోనూ తిరుగుబాటు అభ్యర్థుల ప్రభావం కనిపించింది. అధికారిక అభ్యర్థులకు వ్యతిరేకంగా నామినేషన్లు వేసిన కొందరు బరిలో నిలవడంతో పోటీ రసవత్తరంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో రెబల్స్ విజయం సాధించగా, మరికొన్ని చోట్ల అధికారిక అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం పడినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కొన్ని మున్సిపాలిటీల్లో కూడా ఈ పరిణామాలు రాజకీయ సమీకరణాలను మార్చాయి. టికెట్ల కేటాయింపు సమయంలో స్థానిక నాయకుల అభిప్రాయాలు, అభ్యర్థుల బలాబలాలను అంచనా వేయడంలో లోపాలు జరిగాయా? తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించి ఉపసంహరింపజేయడంలో నాయకత్వాలు విఫలమయ్యాయా? అన్న చర్చ సాగుతోంది.

Also Read : అకస్మాత్తుగా పంటి నొప్పా..? ఈ చిట్కాలు పాటించండి..!

టికెట్ల కేటాయింపులో సమన్వయం కొరవడినా, రెబల్స్‌ను నియంత్రించడంలో విఫలమైనా దాని ప్రభావం చివరకు క్షేత్రస్థాయి అభ్యర్థులపైనే పడిందని కొందరు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. కూటమి నిర్ణయాన్ని విశ్వసించి పోటీకి దిగిన అభ్యర్థులు ప్రచారానికి సమయం, డబ్బు, శ్రమ వెచ్చించారు. పార్టీ ఆదేశాలను పాటిస్తూ మిత్రపక్షాల అభ్యర్థులకు సహకరించిన వారు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో రెబల్స్ పోటీతో ఓడిపోయిన వారికి ఎలాంటి గుర్తింపు, భరోసా కల్పిస్తారన్నది ప్రశ్నగా మారింది. టికెట్ త్యాగం చేసిన వారికే కాకుండా పార్టీ నిర్ణయాన్ని గౌరవించి నష్టపోయిన వారినీ సమానంగా పరిగణించాలని కేడర్ కోరుతోంది.

నామినేటెడ్ పదవుల భర్తీలో అర్హత, పార్టీకి చేసిన సేవ, స్థానికంగా ఉన్న ప్రజాదరణ, ఎన్నికల్లో ఎదురైన పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని నాయకులు సూచిస్తున్నారు. ముందుగా రెబల్స్ కారణంగా ఓడిపోయిన కూటమి అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వాలా? మిత్రధర్మం కోసం టికెట్లు వదులుకున్ నవారికి మొదటి అవకాశం కల్పించాలా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు వర్గాలు పార్టీ ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకున్నవారేనని, ఎవరికీ అన్యాయం జరగకుండా సమతుల్యత పాటించాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉందని కార్యకర్తలు అంటున్నారు.

Also Read : తెలుగు ఆడియన్స్ ను ఫిదా చేస్తున్న మక్కల్ సెల్వన్..!

ఎన్నికల్లో విజయాలు సాధించిన అభ్యర్థులను అభినందించడం ఎంత ముఖ్యమో, ఓటమి పాలైన పార్టీ శ్రేణులకు అండగా నిలవడం కూడా అంతే అవసరం. ముఖ్యంగా నాయకత్వ నిర్ణయాలను విశ్వసించి పోటీ చేసినవారిలో నిరుత్సాహం పెరగకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. రెబల్స్ కారణంగా నష్టపోయిన వారి పరిస్థితిపై నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించి, వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని కార్యకర్తలు కోరుతున్నారు. మిత్రధర్మం కోసం త్యాగం చేసిన వారికి పదవులు ఇస్తామన్న చంద్రబాబు హామీ నేపథ్యంలో, తిరుగుబాటు అభ్యర్థుల వల్ల రాజకీయంగా నష్టపోయిన వారికి ఎలాంటి న్యాయం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కూటమి ఐక్యతను కాపాడటంతోపాటు పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు కల్పించగలిగితేనే భవిష్యత్తులో కార్యకర్తల్లో మరింత నమ్మకం పెరుగుతుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఓటమి నేర్పిన గుణపాఠం...

అధికారం కోల్పోయిన రాజకీయ పార్టీకి ప్రజల్లో...

ఇది కదా కావాల్సింది.....

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్...

తిరుమల లడ్డూ కల్తీ...

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన తిరుమల...

విశాఖ జగన్ కు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన...

రామాయణ పార్ట్1 రివ్యూ...

భారతీయులకు చిరపరిచితమైన రామాయణ గాథను భారీ...

ఏ ఎన్నిక జరిగినా...

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి...

పోల్స్