Thursday, November 5, 2026 08:15 PM
Thursday, November 5, 2026 08:15 PM

ఓటమి నేర్పిన గుణపాఠం ఏది.. కారణాలపై సమీక్షేదీ..?

అధికారం కోల్పోయిన రాజకీయ పార్టీకి ప్రజల్లో తిరిగి విశ్వాసం సంపాదించుకోవడం అంత సులువైన విషయం కాదు. గతంలో జరిగిన తప్పులను గుర్తించి, వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు సాగితేనే రాజకీయంగా పునరుజ్జీవం సాధ్యమవుతుంది. ఆత్మపరిశీలనకు సిద్దపడకుండా ప్రతికూల పరిస్థితులకు, ప్రత్యర్థుల చర్యలకు ఓటమిని ఆపాదిస్తే ప్రయోజనం ఉండదు. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తిరిగి అధికారమే లక్ష్యంగా రాజకీయ కార్యాచరణ సాగిస్తోంది. అయితే లక్ష్యాన్ని ప్రకటించడం వేరు.. అందుకు అవసరమైన సంస్థాగత మార్పులు చేసుకోవడం వేరు. పార్టీ ఓటమికి దారితీసిన కారణాలపై సమగ్ర సమీక్ష, నాయకత్వ శైలిలో మార్పు, క్షేత్రస్థాయి నేతలకు ప్రాధాన్యం వంటి అంశాలపై ఇంకా దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది.

Also Read : రామాయణ పార్ట్1 రివ్యూ : అత్యాధునిక దృశ్య కావ్యం

2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఎదురైన పరాజయం ఆ పార్టీ రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపుగా నిలిచింది. ఐదేళ్ల పాలన తర్వాత ప్రజల తీర్పు ప్రతికూలంగా రావడానికి అనేక రాజకీయ, పాలనాపరమైన అంశాలు కారణమయ్యాయని విశ్లేషణలు వెలువడ్డాయి. అయితే ఓటమి తర్వాత పార్టీ అంతర్గతంగా ఎంతవరకు సమీక్ష నిర్వహించింది? ప్రజల్లో వ్యతిరేకతకు దారితీసిన నిర్ణయాలపై నాయకత్వం ఏ మేరకు చర్చించింది? క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తోంది? అన్న ప్రశ్నలు తెర పైకి వస్తున్నాయి. ప్రత్యర్థుల రాజకీయ వ్యూహాలను విమర్శించడం కంటే సొంత పార్టీ లోపాలను గుర్తించి సరిదిద్దుకోవడమే పునర్నిర్మాణానికి కీలకం.

పార్టీ సంస్థాగత వ్యవస్థ బలంగా ఉండాలంటే ప్రతి స్థాయిలో సమన్వయం అవసరం. అయితే వైసీపీలో చాలా నియోజకవర్గాల్లో ఇన్చార్జిల నిర్ణయాలకే అధిక ప్రాధాన్యం దక్కుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక, పార్టీ పదవుల పంపిణీ, స్థానిక రాజకీయ నిర్ణయాల్లో ఇతర నాయకుల అభిప్రాయాలకు తగిన స్థానం లభించడం లేదనే అసంతృప్తి చాలా మంది నేతల్లో ఉంది. నియోజకవర్గ ఇన్చార్జి చుట్టూ ఉన్న ఒక వర్గానికే ప్రాధాన్యం దక్కడంతో మిగిలిన నాయకులు, కార్యకర్తల్లో నిరుత్సాహం పెరిగింది. పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు, నిర్ణయాల్లో భాగస్వామ్యం కల్పించకపోతే క్షేత్రస్థాయిలో సంస్థాగత బలం దెబ్బతింటుంది.

Also Read : ఇది కదా కావాల్సింది.. సుధారెడ్డి ధైర్యానికి వైసీపీ షాక్..!

సామాజిక న్యాయం, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం గురించి పార్టీ నాయకత్వం ప్రస్తావిస్తున్నప్పటికీ, పదవులు పొందిన వారికి నిర్ణయాధికారంలో ఎంతవరకు భాగస్వామ్యం లభిస్తుందన్న చర్చ కూడా ఉంది. నామమాత్రపు పదవులతో సరిపెట్టకుండా బాధ్యతలు, అధికారాలు కల్పించినప్పుడే ఆయా వర్గాల్లో రాజకీయ భాగస్వామ్యం పెరుగుతుంది. స్థానిక స్థాయిలో నాయకులను నియమించిన తర్వాత వారి పనితీరుకు అవసరమైన స్వేచ్ఛ ఇవ్వకపోతే ఆశించిన ఫలితాలు రావు. సామాజిక సమీకరణాలు కేవలం పదవుల కేటాయింపుకే పరిమితం కాకుండా పార్టీ నిర్ణయ ప్రక్రియలోనూ ప్రతిబింబించాలి.

పార్టీ అధినేతకు క్షేత్రస్థాయి పరిస్థితులపై నిరంతర సమాచారం అందాలి. నియోజకవర్గ ఇన్చార్జీలు చెప్పే వివరాలే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, సాధారణ కార్యకర్తల అభిప్రాయాలు కూడా నేరుగా తెలుసుకునే వ్యవస్థ ఉండాలి. అప్పుడే వాస్తవ పరిస్థితులు నాయకత్వానికి తెలుస్తాయి. నాయకత్వాన్ని కలిసే అవకాశం పరిమిత వర్గానికే దక్కుతుందన్న విమర్శలకు తెరదించాల్సిన బాధ్యత పార్టీ అధినేతపై ఉంది. కార్యకర్తలు తమ సమస్యలను నేరుగా చెప్పుకునే వేదికలు ఏర్పాటు చేయడం, క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించడం ద్వారా పార్టీకి, కేడర్‌కు మధ్య దూరాన్ని తగ్గించవచ్చు. మరోవైపు ఇతర పార్టీల్లో అగ్రనేతలు కార్యకర్తలతో మమేకమయ్యే కార్యక్రమాలు నిర్వహిస్తున్న తీరును కూడా వైసీపీ పరిశీలించాల్సిన అవసరం ఉంది.

రాజకీయ పార్టీల్లో వ్యక్తిగత నాయకత్వానికి ప్రాధాన్యం ఉంటుంది. అయితే ప్రతి నిర్ణయమూ ఒకరిద్దరి అభిప్రాయాలకే పరిమితమైతే సంస్థాగత వ్యవస్థ బలహీనపడుతుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి నేతలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, క్షేత్రస్థాయి కార్యకర్తలతో సమన్వయం అవసరం. అభ్యర్థుల ఎంపికలో స్థానిక పరిస్థితులు, సామాజిక సమీకరణాలు, ప్రజాభిప్రాయం, నాయకుల పనితీరును పరిగణనలోకి తీసుకోవాలి. వ్యక్తిగత విధేయత కంటే ప్రజల్లో ఉన్న ఆదరణ, పార్టీ కోసం చేసిన కృషికి ప్రాధాన్యం ఇచ్చే విధానం ఉండాలి. అప్పుడే నాయకత్వంపై నమ్మకం పెరుగుతుంది.

Also Read : ఐపీఎల్ 2027 మెగా ట్రేడ్ డీల్.. చెన్నై వర్సెస్ హైదరాబాద్..!

ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం, ప్రజా సమస్యలపై పోరాడడం వైసీపీ బాధ్యత. అయితే రాజకీయ పోరాటం అంతర్గత ప్రక్షాళనకు ప్రత్యామ్నాయం కాలేదు. అధికార పార్టీ నిర్ణయాలపై విమర్శలు చేస్తూనే సొంత పార్టీ వ్యవస్థలోని -లోపాలను కూడా సరిదిద్దుకోవాలి. కేడర్‌కు భరోసా కల్పించడం, నాయకుల మధ్య సమన్వయం పెంచడం, ప్రజల్లోకి వెళ్లే కార్య క్రమాలను బలోపేతం చేయడం వంటి చర్యలు సమాంతరంగా సాగాలి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏర్పడిన అసంతృప్తికి కారణమైన అంశాలు మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి. కానీ వైసీపీలో ప్రస్తుతం అలాంటివి ఏవీ జరగటం లేదు. ఎంత వరకు పదవులు, అధికారం.. అన్నట్లుగా అధినేత మాట్లాడుతున్న తీరుతో.. కిందిస్థాయి క్యాడర్‌లో కూడా నిరాశే కనిపిస్తోంది. ఓటరును ఆకట్టుకోవటం అనే మాటను వైసీపీ నేతలు పూర్తిగా పక్కన పెట్టేశారు. అధికార పార్టీని విమర్శించడమే ఏకైక పనిగా పెట్టుకుంటే.. ఆ పార్టీకి ఎక్కువ కాలం రాజకీయ మనుగడ కష్టమే.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఇది కదా కావాల్సింది.....

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్...

తిరుమల లడ్డూ కల్తీ...

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన తిరుమల...

విశాఖ జగన్ కు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన...

రామాయణ పార్ట్1 రివ్యూ...

భారతీయులకు చిరపరిచితమైన రామాయణ గాథను భారీ...

ఏ ఎన్నిక జరిగినా...

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి...

ఆధారాలు ఇచ్చేస్తా.. ఈడీ...

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్...

పోల్స్