Thursday, November 5, 2026 05:46 PM
Thursday, November 5, 2026 05:46 PM

వాళ్లకు అదే పని.. బీ కేర్ ఫుల్..!

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య కులం కలహాలు పెడుతున్న వైసీపీ మీడియాలు. ఇప్పుడు ఇదే మాట బాగా వినిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే.. చాప కింద నీరులా తమ పని కానిస్తోంది వైసీపీ మీడియా. తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య కులం కలహాలు పెట్టేందుకు వైసీపీ మీడియా, ఆ పార్టీ అనుబంధ మీడియాతో పాటు ఆ పార్టీ ప్యాకేజి సోషల్ మీడియాలలో పెద్ద ఎత్తున తప్పుడు కథనాలు ప్రచారం చేయటమే కాదు, జన సైనికులను, ముఖ్యంగా కాపు కులం వారిని రెచ్చగొడుతున్నారు. అయితే ఈ విషయం ఇప్పుడు నేరుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టిలో పడింది. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన పవన్.. నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో ముఖాముఖి చర్చలు జరుపుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పవన్ ఫ్యాన్స్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Also Read : ఆధారాలు ఇచ్చేస్తా.. ఈడీ ముందు అంబటి ఒప్పేసుకున్నారా..?

అయితే తొలి నుంచి వారిద్దరి మధ్య జరిగే చర్చలు బయటకు రావటం లేదు. దీంతో వైసీపీ అనుకూల మీడియా ఇదే అదునుగా భావించింది. రెండు పార్టీల మధ్య కలహాలు పెట్టేందుకు కులం కార్డు బయటకు తీసింది. వరుసగా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోంది. నిజానికి ఇప్పటి వరకు వారిద్దరి మధ్య చర్చలు ఏమి జరిగాయనే విషయం ఏ ఒక్కరికి తెలియటం లేదు. దీనితో వైసీపీ అభిమాన, అనుకూల మీడియా రెచ్చిపోయి కులం కలహాలు సృష్టించేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్న ప్రయత్నాలు పలించటం లేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, వారిద్దరు పరస్పర అవగాహనతో ఉన్నారని స్పష్టం కావటంతో వైసీపీ అభిమాన మీడియాకు పాలుపోవటం లేదు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు దగ్గరకు వెళ్లేటప్పుడు.. తన వెంట చర్చలకు ఏ ఒక్కరిని తీసుకెళ్లటం లేదు. ఇది జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటి వరకు మంత్రి మనోహర్‌కు, రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్‌కు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న పవన్.. వారిద్దరిని ఇప్పుడు దూరం పెడుతున్నారా.. అనే అనుమానాలు కనిపిస్తున్నాయి కూడా. పవన్ ఇచ్చిన ప్రాధాన్యతను వారిద్దరు దుర్వినియోగం చేస్తున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎప్పుడయితే పవన్ కళ్యాణ్ ఒంటరిగా చంద్రబాబుతో చర్చలు జరుపుతున్నారని తెలిసిన జనసైనికులే సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : తిరుమల లడ్డూ కల్తీ కేసుపై సుప్రీం సంచలన నిర్ణయం..!

తనను మంత్రి నాదెండ్ల మనోహర్.. రాజ్యసభ సభ్యుడు లింగమనేని తప్పుదోవ పట్టిస్తున్నారనే అనుమానంతో పాటు.. వారిద్దరికి ఇచ్చిన ప్రాధాన్యతను దుర్వినియోగం చేసున్నారని పవన్ కళ్యాణ్‌కు అనిపించినట్లుందనే మాట బాగా వినిపిస్తోంది. అంతేకాదు నాదెండ్ల, లింగమనేని వ్యవహార శైలి, వారిద్దరి తీరు, మెజారిటీ జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మింగుడు పడలేదన్న విషయాన్ని కాస్తంత ఆలస్యంగా పవన్ కళ్యాణ్ తెలుసుకుని.. ఇక నుంచి ముఖ్యమైన విషయాలన్నీ తానే స్వయంగా చూసుకోవాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో ఒంటరిగా చర్చ లు జరపటమే అందుకు నిదర్శనం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏది ఏమైనా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్యవర్తులు ఎవరూ లేకుండా పరస్పర అవగాహనతో ఒంటరిగా చర్చించుకోవటం శుభపరిణామమే అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ సకాలంలో సరైన నిర్ణయం తీసుకున్నారని.. ఇప్పటివరకు జరిగిన నష్టాన్ని సరి చేశారని జనసేన నాయకులు భావిస్తున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఇది కదా కావాల్సింది.....

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్...

తిరుమల లడ్డూ కల్తీ...

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన తిరుమల...

విశాఖ జగన్ కు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన...

రామాయణ పార్ట్1 రివ్యూ...

భారతీయులకు చిరపరిచితమైన రామాయణ గాథను భారీ...

ఏ ఎన్నిక జరిగినా...

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి...

ఆధారాలు ఇచ్చేస్తా.. ఈడీ...

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్...

పోల్స్