Friday, November 6, 2026 03:34 PM
Friday, November 6, 2026 03:34 PM

ఇజ్రాయెల్ ప్రధానిగా గడీ ఐసెన్‌కోట్ ఫిక్స్..?

ఇజ్రాయెల్ సాధారణ ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడి రాజకీయాలు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి. దేశ తదుపరి ప్రధానమంత్రిగా ప్రతిపక్ష నేత, మాజీ సైనిక అధిపతి గడీ ఐసెన్‌కోట్ పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రధాని పదవిపై ఆశలు వదులుకున్నట్లే కనపడుతోంది. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉంటూ వస్తున్న దేశంలోని అరబ్ పార్టీలు ఐసెన్‌కోట్‌కు తమ మద్దతును ప్రకటించాయి. ఇటీవల ఇజ్రాయెల్ పార్లమెంట్ కనెసెట్ కు జరిగిన ఎన్నికల్లో ఏ ఒక్క కూటమికి స్పష్టమైన మెజారిటీ రాలేదు.

Also Read: గుంటూరులో అర్ధరాత్రి హైడ్రామా.. అప్పిరెడ్డికి షాక్ ఇచ్చిన పోలీసులు..!

బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని కూటమికి 53 స్థానాలు రాగా, ఐసెన్‌కోట్ నేతృత్వంలోని వ్యతిరేక కూటమికి 48 స్థానాలు లభించాయి. అయితే, ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 19 స్థానాలను గెలుచుకున్న అరబ్ పార్టీల కూటమి ఇక్కడ కింగ్ మేకర్‌గా అవతరించింది. నెతన్యాహును తిరిగి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ అరబ్ కూటమి ఐసెన్‌కోట్‌కు మద్దతు ఇవ్వాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ తో గురువారం జరిపిన సంప్రదింపుల్లో అరబ్ ప్రతినిధులు మొదటగా ఐసెన్‌కోట్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలని సిఫార్సు చేశారు.

Also Read: కేంద్ర ఎన్నికల సంఘంలో సంచలన పరిణామాలు..!

విపక్ష కూటమికి చెందిన 48 స్థానాలతో పాటు ఈ 19 అరబ్ స్థానాలు తోడవ్వడంతో ఐసెన్‌కోట్‌కు మొత్తం 67 మంది సభ్యుల బలం చేకూరింది. ఇది ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన 61 స్థానాల సాధారణ మెజారిటీ కంటే చాలా ఎక్కువ. మరోవైపు బెంజమిన్ నెతన్యాహుకు కేవలం 46 మంది సభ్యుల మద్దతు మాత్రమే దక్కింది. నెతన్యాహుకు దీర్ఘకాలంగా నమ్మకమైన మిత్రపక్షంగా ఉంటూ వస్తున్న అల్ట్రా-ఆర్థడాక్స్ పార్టీ ‘యునైటెడ్ తోరా జుడాయిజం’ ఈసారి ఆయనకు మద్దతు ప్రకటించేందుకు నిరాకరించడం గమనార్హం. సైనిక మినహాయింపు చట్టాల విషయంలో వచ్చిన విభేదాల కారణంగానే వారు నెతన్యాహుకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మెజారిటీ సభ్యుల మద్దతు స్పష్టంగా ఐసెన్‌కోట్‌కే ఉన్నందున, ఆదివారం నాడు దేశ అధ్యక్షుడు హెర్జోగ్ అధికారికంగా ఆయనకే ప్రభుత్వం ఏర్పాటు చేసే బాధ్యతలను అప్పగించే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ మీడియా తెలిపింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

అనంతపురంలో ఏం జరుగుతోంది.....

తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా భావించే అనంతపురం...

పోలవరం ఇప్పట్లో కష్టమేనా..?...

ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు...

గుంటూరులో అర్ధరాత్రి హైడ్రామా.....

గుంటూరు సమీపంలోని నల్లపాడు వద్ద స్థానిక...

ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసు.....

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1...

రెబల్స్ దెబ్బ.. మరి...

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ఘట్టం...

ఓటమి నేర్పిన గుణపాఠం...

అధికారం కోల్పోయిన రాజకీయ పార్టీకి ప్రజల్లో...

పోల్స్