Tuesday, November 10, 2026 02:12 PM
Tuesday, November 10, 2026 02:12 PM

అక్షర్ కోసం రూ. 10 కోట్ల స్టార్ ప్లేయర్‌ను వదులుకుంటారా..?

ఐపీఎల్ 2027 ట్రేడింగ్ విండో ఇంకా ఓపెన్ లోనే ఉండటంతో ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల మార్పిడిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకోబోతోందనే వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. అయితే, ఈ ట్రేడింగ్ చర్చల నేపథ్యంలో భారత సీనియర్ క్రికెటర్ హనుమ విహారి సీఎస్‌కే యాజమాన్యానికి ఒక కీలక హెచ్చరిక చేసాడు. అక్షర్ పటేల్ కోసం జట్టులోని ఒక అగ్రశ్రేణి ఆటగాడిని వదులుకుంటే చెన్నైకి భారీ నష్టం తప్పదని ఆయన అభిప్రాయపడ్డాడు.

Also Read : గాలి కాలుష్యం ఉన్నప్పుడు వ్యాయామం చేయకూడదా..?

తన యూట్యూబ్ ఛానెల్‌లో విహారి మాట్లాడుతూ.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అక్షర్ పటేల్ రూపంలో ఒక మంచి ఆల్‌రౌండర్ తోడవడం అదనపు బలాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదన్నాడు. గత సీజన్లలో సీఎస్‌కేకు నంబర్ 6, నంబర్ 7 స్థానాల్లో లోటు స్పష్టంగా కనిపించిందని, అలాగే ఒక నాణ్యమైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అవసరం కూడా ఉందన్నాడు. కానీ, అతని కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌తో ట్రేడింగ్ చేసే క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ నూర్ అహ్మద్‌ను వదులుకోవడం మాత్రం చాలా తప్పుడు నిర్ణయం అవుతుందని హెచ్చరించాడు.

Also Read : షర్మిల ఔట్.. ఏపీ పీసీసీ చీఫ్‌గా ఆమంచి ..?

ఐపీఎల్ 2025 మెగా వేలంలో సీఎస్‌కే ఏకంగా రూ. 10 కోట్లు వెచ్చించి నూర్ అహ్మద్‌ను కొనుగోలు చేసిన సంగతిని గుర్తు చేసాడు. ఒకవేళ చెన్నై జట్టు అక్షర్ పటేల్‌ను తీసుకురావాలనుకుంటే, డెవాల్డ్ బ్రెవిస్‌ను వదులుకోవడం బెటర్ ఆప్షన్ కావచ్చు అని, ఇప్పటికే ఆ రోల్ కోసం లియామ్ లివింగ్‌స్టోన్‌ను జట్టులోకి తీసుకున్నారు కాబట్టి బ్రెవిస్ స్థానాన్ని భర్తీ చేయవచ్చని విహారి విశ్లేషించాడు. ఒకవేళ డెవాల్డ్ బ్రెవిస్‌ను వదులుకుని అక్షర్ పటేల్‌ను తెచ్చుకుంటే చెన్నై బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ బ్యాలెన్స్ అవుతుందని చెప్పాడు. అంతేకాకుండా, చెన్నై హోమ్ గ్రౌండ్ అయిన చేపాక్ పిచ్‌పై నూర్ అహ్మద్, అక్షర్ పటేల్ జోడీ అద్భుతాలు సృష్టించగలదని, కాబట్టి నూర్‌ను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోవద్దని సూచించాడు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

పవన్ విడాకులపై వైసీపీ...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్...

పెట్రోల్ బంకులలో కొత్త...

గుంటూరు నగరంలోని చుట్టుగుంట వీఐపీ రోడ్డులో...

తెలంగాణాలో సంచలన తీర్పు.....

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది....

షర్మిల ఔట్.. ఏపీ...

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో సరికొత్త రాజకీయ...

సీట్లు కూటమికి.. కానీ...

సీట్లు గెలిస్తే.. ఓటర్లంతా తన వైపే...

రిక్షావాలా MPTC.. ఆటోవాలా...

సామాన్యులకు ప్రజాస్వామ్యంలో స్థానం ఉందని స్థానిక...

పోల్స్