Tuesday, November 10, 2026 02:13 PM
Tuesday, November 10, 2026 02:13 PM

పవన్ విడాకులపై వైసీపీ మౌనం వెనుక అసలు ప్లాన్ ఇదేనా..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించిన ఉమ్మడి లేఖ తీవ్ర సంచలనంగా మారింది. అయితే, ఈ వ్యవహారంపై ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించి, తమ నేతలు, సోషల్ మీడియా క్యాడర్‌కు అంతర్గత సర్క్యులర్ జారీ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పవన్ విడాకులపై పాజిటివ్‌గా గానీ, నెగెటివ్‌గా గానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని వైసీపీ అధిష్ఠానం ఆదేశించడం వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం, గత అనుభవాల నుంచి నేర్చుకున్న గుణపాఠం దాగి ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Also Read : సీట్లు కూటమికి.. కానీ ఓట్లు మాత్రం..!

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ కీలక నేతలతో పాటు సోషల్ మీడియా విభాగం కూడా పవన్ కళ్యాణ్‌ను రాజకీయంగా దెబ్బతీయడానికి ఆయన వ్యక్తిగత జీవితాన్ని, మూడు పెళ్లిళ్ల అంశాన్ని విపరీతంగా టార్గెట్ చేసింది. బహిరంగ సభల్లో సైతం పవన్ పెళ్లిళ్ల వ్యవస్థపై చేసిన ఘాటు వ్యాఖ్యలు, విమర్శలు సామాన్య ప్రజల్లో, ముఖ్యంగా మహిళా ఓటర్లలో రివర్స్ ఎఫెక్ట్ చూపించాయనేది జగన్మోహన్ రెడ్డి అంచనా. వ్యక్తిగత జీవితాన్ని రాజకీయంలోకి లాగడం వల్ల పవన్ కళ్యాణ్‌పై ప్రజల్లో అనవసరమైన సానుభూతి పెరిగిందని, అది కూటమి ఘనవిజయానికి ఒక పరోక్ష కారణమైందని వైసీపీ అంతర్గత సమీక్షల్లో తేలింది.

వ్యక్తిగత విమర్శల వల్ల పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందే తప్ప, రాజకీయంగా ఎలాంటి లబ్ధి చేకూరలేదని వైసీపీ నాయకత్వం ఇప్పుడు స్పష్టంగా నమ్ముతోంది. అందుకే, ఈసారి పవన్ అధికారికంగానే విడాకుల ప్రకటన విడుదల చేసినప్పటికీ.. ఆవేశపడి విమర్శలు చేస్తే మళ్లీ పాత తప్పిదమే పునరావృతమవుతుందని వైసీపీ అగ్రనాయకత్వం భావించింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా అధికారంలో ఉన్నారని, ఈ సమయంలో ఆయన వ్యక్తిగత వ్యవహారంపై బురదజల్లే ప్రయత్నం చేస్తే కూటమి ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి దీన్ని ఒక ఆయుధంగా వాడుకునే ప్రమాదం ఉందని వైసీపీ అంచనా వేస్తోంది.

Also Read : తెలంగాణాలో సంచలన తీర్పు.. కలెక్టర్ కు ఆరు నెలలు జైలు శిక్ష..!

ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి అధికార పక్షానికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే వైసీపీ ఈ వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ స్టాండ్ చాలా స్పష్టంగా ఉంది. వ్యక్తిగత అంశాలపై చర్చలను పక్కన పెట్టి.. రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యం, కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో జరుగుతున్న ఆలస్యం, ప్రజా సమస్యలపైనే పూర్తి స్థాయిలో పోరాడాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసింది. పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగత బలహీనతలపై కాకుండా, కేవలం పాలనాపరమైన విమర్శలతోనే ఢీకొట్టాలనేది వైసీపీ కొత్త వెర్షన్.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

పెట్రోల్ బంకులలో కొత్త...

గుంటూరు నగరంలోని చుట్టుగుంట వీఐపీ రోడ్డులో...

తెలంగాణాలో సంచలన తీర్పు.....

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది....

షర్మిల ఔట్.. ఏపీ...

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో సరికొత్త రాజకీయ...

సీట్లు కూటమికి.. కానీ...

సీట్లు గెలిస్తే.. ఓటర్లంతా తన వైపే...

రిక్షావాలా MPTC.. ఆటోవాలా...

సామాన్యులకు ప్రజాస్వామ్యంలో స్థానం ఉందని స్థానిక...

పెద్ద నోట్ల రద్దుపై...

దేశంలో, రాష్ట్రంలో వేళ్లూనుకుపోయిన అవినీతిని సమూలంగా...

పోల్స్