Monday, November 9, 2026 02:08 PM
Monday, November 9, 2026 02:08 PM

ట్రేడింగ్ విండోలో గుజరాత్ టైటాన్స్ భారీ స్కెచ్..!

ఐపీఎల్ 2027 వేలానికి ముందే ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల మార్పిడి ప్రక్రియ తెరవెనుక జోరందుకుంది. ముంబై ఇండియన్స్ నుంచి హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్‌కు మారుతున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్న తరుణంలో, శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ ఒక సర్ప్రైజ్ ట్రేడ్‌కు తెరలేపింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్న 28 ఏళ్ల భారత ఆటగాడు.. పవర్‌హిట్టర్, ఫినిషర్ అశుతోష్ శర్మను తమ జట్టులోకి తెచ్చుకునేందుకు గుజరాత్ యాజమాన్యం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

Also Read : ఏపీలో మరో ఎన్నికల సందడి.. సర్కార్ గ్రీన్ సిగ్నల్..!

ఐపీఎల్ కెరీర్‌లో 168.86 స్ట్రైక్ రేట్‌తో మెరుపులు మెరిపిస్తున్న అశుతోష్ శర్మ కోసం గుజరాత్ టైటాన్స్ కొన్ని నెలల క్రితమే ఢిల్లీని సంప్రదించినట్లు సమాచారం. అప్పట్లో ఢిల్లీ నుంచి ఎలాంటి స్పందన రాకపోయినప్పటికీ, ప్రస్తుతం ఆ జట్టుకు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ హెడ్ కోచ్‌గా రావడంతో ఈ ట్రేడ్ ప్రతిపాదన మళ్లీ చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇతడిని రూ. 3.8 కోట్లకు కొనుగోలు చేసింది. గత ఏడాది.. లక్నో సూపర్ జైంట్స్‌పై కేవలం 31 బంతుల్లోనే 66 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించిన అశుతోష్‌ను దక్కించుకునే రేసులో గుజరాత్‌తో పాటు లక్నో కూడా పోటీ పడుతోంది.

Also Read : మాజీలకు షాక్.. ఎందుకిలా..?

గుజరాత్ టైటాన్స్ జట్టులో టాప్ ఆర్డర్‌లో శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ వంటి నిలకడగా ఆడే.. ఆటగాళ్లు ఉన్నప్పటికీ, వారు విఫలమైన సమయంలో.. హిట్టింగ్ చేసే ఫినిషర్ కొరత స్పష్టంగా కనిపిస్తోంది. రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో అశుతోష్ శర్మను జట్టులోకి తెచ్చుకుంటే ఆ సమస్య తీరుతుందని గుజరాత్ భావిస్తోంది. ఈ ట్రేడ్‌లో భాగంగా గుజరాత్ జట్టు.. ఫాస్ట్ బౌలర్.. 24 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ అశోక్ శర్మను ఢిల్లీకి ఆఫర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఓట్ల శాతం, సీట్ల...

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై...

మిడ్‌టర్మ్ ఎన్నికల ఓటమిపై...

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ...

ఏపీలో మరో ఎన్నికల...

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, కార్పొరేషన్, జడ్పీటీసీ, ఎంపీటీసీ...

క్యాన్సర్ రోగులకు కేంద్రం...

క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న బాధితులకు కేంద్ర...

మాజీలకు షాక్.. ఎందుకిలా..?

విజయనగరం జిల్లాలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్...

మేనత్త ఊరిలో జగన్‌కు...

వైకాపా అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్...

పోల్స్