Monday, November 9, 2026 02:01 PM
Monday, November 9, 2026 02:01 PM

ఓట్ల శాతం, సీట్ల వివరాలపై చంద్రబాబు కీలక ప్రకటన..!

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల కంటే ఈ స్థానిక ఎన్నికల నాటికి ఎన్డీఏ కూటమి బలం గ్రాండ్ గా పుంజుకుందని, ఓట్ల శాతం పరంగా కూటమికి ఆదరణ మరింత పెరిగిందని సీఎం గణాంకాలతో సహా వివరించారు. పట్టణాలు, పరిషత్ ఎన్నికల్లో మొత్తంగా కూటమి 58.9 శాతం ఓట్ షేర్ సాధించిందని చంద్రబాబు వెల్లడించారు.

Also Read : వార్నింగ్ బెల్.. బీ కేర్ ఫుల్..!

2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి 55.3 శాతం ఓట్లు రాగా, ఇప్పుడు అదనంగా 3.6 శాతం ఓట్లు పెరిగాయని చెప్పారు. అదే సమయంలో వైసీపీ ఓట్ షేర్ 39.81 శాతం నుండి 33.56 శాతానికి పడిపోయిందని, అంటే దాదాపు 6.25 శాతం ఓట్లు తగ్గాయని సీఎం స్పష్టం చేశారు. మొత్తంగా కూటమికి, వైసీపీకి మధ్య ఓట్ల శాతంలో ఏకంగా 25.34 శాతం భారీ గ్యాప్ ఉందని విశ్లేషించారు. పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల వారీగా ఓట్ల సరళిని ముఖ్యమంత్రి చంద్రబాబు క్లియర్ గా వివరించారు.

పట్టణాల్లో ఎన్డీఏకు 59.9 శాతం, వైసీపీకి 34.3 శాతం ఓట్లు రాగా, కూటమి ఏకంగా 94 శాతం స్ట్రైక్ రేట్ సాధించిందని పేర్కొన్నారు. జడ్పీటీసీ ఎన్నికల్లో ఎన్డీఏ 57.6 శాతం, వైసీపీ 39.7 శాతం ఓట్ షేర్ సాధించగా, కూటమి స్ట్రైక్ రేట్ 87.5 శాతంగా నమోదైంది. పట్టణాల్లో 25.60 శాతం, పల్లెల్లో 17.9 శాతం మేర కూటమికి-వైసీపీకి ఓట్ల శాతంలో స్పష్టమైన వ్యత్యాసం ఉందన్నారు. ఇక ఎంపీటీసీల విషయానికొస్తే.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 9,818 స్థానాలకు గానూ కూటమి ఏకంగా 7,803 స్థానాలను దక్కించుకుందని, దీనివల్ల 90 శాతానికి పైగా మండల అధ్యక్ష స్థానాలను కూటమి గెలుచుకోబోతోందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

Also Read : ఏపీలో మరో ఎన్నికల సందడి.. సర్కార్ గ్రీన్ సిగ్నల్..!

ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లలోనూ పట్టణాల్లో ఎన్డీఏకు 65.7 శాతం, పరిషత్ ఎన్నికల్లో 62.83 శాతం ఓట్లు పడ్డాయని వివరించారు. రాష్ట్రంలోని మొత్తం 659 జెడ్పీటీసీ స్థానాలకు గానూ కూటమి 575 స్థానాలను గెలుచుకుని ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. రాష్ట్రంలోని మొత్తం 28 జిల్లాల్లో 27 జిల్లాల్లో కూటమి స్పష్టమైన ఆధిక్యత సాధించగా, కేవలం ఒక్క అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రమే వైసీపీ కూటమి కంటే ఎక్కువ సీట్లు సాధించగలిగింది. మరీ ముఖ్యంగా రాష్ట్రంలోని 7 జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కనీసం ఒక్కటంటే ఒక్క జెడ్పీటీసీ స్థానం కూడా దక్కకుండా ఓటర్లు పూర్తిగా తిరస్కరించారని సీఎం ఎద్దేవా చేశారు. అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, మార్కాపురం, పల్నాడు, పశ్చిమ గోదావరి, మరియు విశాఖపట్నం జిల్లాల్లో వైసీపీ సింగిల్ డిజిట్ కూడా సాధించలేక సున్నాకే పరిమితమైందని చంద్రబాబు అధికారిక ఫలితాల వివరాలను మీడియా సాక్షిగా విడుదల చేశారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ట్రేడింగ్ విండోలో గుజరాత్...

ఐపీఎల్ 2027 వేలానికి ముందే ఫ్రాంచైజీల...

మిడ్‌టర్మ్ ఎన్నికల ఓటమిపై...

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ...

ఏపీలో మరో ఎన్నికల...

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, కార్పొరేషన్, జడ్పీటీసీ, ఎంపీటీసీ...

క్యాన్సర్ రోగులకు కేంద్రం...

క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న బాధితులకు కేంద్ర...

మాజీలకు షాక్.. ఎందుకిలా..?

విజయనగరం జిల్లాలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్...

మేనత్త ఊరిలో జగన్‌కు...

వైకాపా అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్...

పోల్స్