Monday, November 9, 2026 01:14 PM
Monday, November 9, 2026 01:14 PM

మిడ్‌టర్మ్ ఎన్నికల ఓటమిపై డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..!

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఎదుర్కొన్న దారుణ ఓటమిపై ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. ఈ ఎన్నికల ఫలితాల వల్ల అమెరికా తన చరిత్రలో ఒక పెద్ద వెనకడుగు వేసిందని ఆయన వ్యాఖ్యానించారు. గత మంగళవారం జరిగిన ఈ ఎన్నికల్లో డెమొక్రాట్లు కాంగ్రెస్‌లోని రెండు సభలపై.. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్ పట్టు సాధించడమే కాకుండా, దశాబ్దాలుగా రిపబ్లికన్ల కంచుకోటలుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా చారిత్రాత్మక విజయాలను నమోదు చేశారు.

Also Read : ఏపీలో మరో ఎన్నికల సందడి.. సర్కార్ గ్రీన్ సిగ్నల్..!

ఈ ఓటమిపై తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తన హయాంలో ఎంతో వృద్ధి చెందిన స్టాక్ మార్కెట్, ఈ ఎన్నికల ఓటమి ఫలితంగా నష్టాలను చవిచూసిందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ తిరోగమనానికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, తాము గతంలో కంటే మరింత బలంగా, భారీ స్థాయిలో తిరిగి పుంజుకుంటామని ట్రంప్ ఓడిపోయిన అభ్యర్ధులకు బాధితులకు, మద్దతుదారులకు భరోసా ఇచ్చారు.

Also Read : న్యోమాలో అద్భుత ల్యాండింగ్.. చరిత్ర సృష్టించిన వాయుసేన!

మరోవైపు రిపబ్లికన్ పార్టీ నేతలు ఈ ఓటమి భారంతో ఉన్నప్పటికీ, ట్రంప్ మాత్రం తన దూకుడును తగ్గించడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఆయన తన కఠినమైన వలస విధానాల రూపశిల్పి, కీలక సలహాదారు అయిన స్టీఫెన్ మిల్లర్‌ను కొత్త చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమించారు. ఈ నియామకం ద్వారా భవిష్యత్తులో డెమొక్రాట్లతో మరింత కఠినమైన పోరాటానికి తాను సిద్ధంగా ఉన్నాననే సంకేతాలను ట్రంప్ పంపారు. దీనికి ప్రతిగా డెమొక్రాట్లు కూడా ట్రంప్ పరిపాలనను ప్రతి అడుగులోనూ అడ్డుకుంటామని, వారిని జవాబుదారీగా ఉంచుతామని స్పష్టం చేశారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఓట్ల శాతం, సీట్ల...

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై...

ఏపీలో మరో ఎన్నికల...

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, కార్పొరేషన్, జడ్పీటీసీ, ఎంపీటీసీ...

క్యాన్సర్ రోగులకు కేంద్రం...

క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న బాధితులకు కేంద్ర...

మాజీలకు షాక్.. ఎందుకిలా..?

విజయనగరం జిల్లాలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్...

మేనత్త ఊరిలో జగన్‌కు...

వైకాపా అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్...

న్యోమాలో అద్భుత ల్యాండింగ్.....

భారత వాయుసేన అరుదైన ఘనత సాధించింది....

పోల్స్