Monday, November 9, 2026 12:32 PM
Monday, November 9, 2026 12:32 PM

క్యాన్సర్ రోగులకు కేంద్రం బిగ్ రిలీఫ్..!

క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న బాధితులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఆదేశాల మేరకు 137 రకాల నాన్-షెడ్యూల్డ్ క్యాన్సర్ మందుల ధరలు నేటి నుంచి భారీగా తగ్గనున్నాయి. ఈ మందుల గరిష్ట రిటైల్ ధరపై ట్రేడ్ మార్జిన్లను 30 శాతానికి పరిమితం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం అమల్లోకి వచ్చింది. దీనివల్ల వివిధ బ్రాండ్ల క్యాన్సర్ ఔషధాల ధరలు 50 శాతం నుండి అత్యధికంగా 96.45 శాతం వరకు తగ్గనున్నాయి.

Also Read : ప్రాదేశిక పోరులో కూటమి దూకుడు.. కానీ..!

ఈ నూతన విధానం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 76 ఫార్మా కంపెనీలు తమకు చెందిన 1,225 ఫార్ములేషన్ల కొత్త ధరలను ప్రకటించాయి. ఇందులో దాదాపు 1,031 ఫార్ములేషన్ల ధరలు నేరుగా తగ్గాయి. ఉదాహరణకు, రొమ్ము క్యాన్సర్ చికిత్సలో వాడే బాల్బోప్రో క్యాప్సూల్ ధర రూ.40,421 నుంచి ఏకంగా రూ.2,720కి తగ్గగా, ప్రోస్టేట్ క్యాన్సర్ నివారణ ఔషధం అబిరోన్ ధర రూ.41,250 నుండి రూ.3,218కి పడిపోయింది. ఈ చారిత్రాత్మక నిర్ణయం వల్ల క్యాన్సర్ బాధితులకు దేశవ్యాప్తంగా ఏటా సుమారు రూ.3,502 కోట్ల మేర సొంత జేబు ఖర్చులు ఆదా అవుతాయని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Also Read : న్యోమాలో అద్భుత ల్యాండింగ్.. చరిత్ర సృష్టించిన వాయుసేన!

ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. మారిన ఈ నూతన ధరల పట్టికను అన్ని ఆసుపత్రులు, ఫార్మసీలు, రిటైల్ డీలర్లు తమ ప్రాంగణాల్లోనూ, వెబ్‌సైట్లలోనూ స్పష్టంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. మార్కెట్లోకి ఇంకా విడుదల కాని మరో 10 నుండి 15 రకాల క్యాన్సర్ మందులకు కూడా భవిష్యత్తులో ఈ ధరల నియంత్రణ వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. వినియోగదారులు అదనపు సమాచారం లేదా సవరించిన ఖచ్చితమైన ధరల వివరాలను ఫార్మా సహి దామ్ మొబైల్ యాప్ లేదా ఎన్‌పీపీఏ అధికారిక వెబ్‌సైట్ ద్వారా పరిశీలించుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా పాత ధరలకే విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్లు హెచ్చరించారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

మిడ్‌టర్మ్ ఎన్నికల ఓటమిపై...

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ...

ఏపీలో మరో ఎన్నికల...

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, కార్పొరేషన్, జడ్పీటీసీ, ఎంపీటీసీ...

మాజీలకు షాక్.. ఎందుకిలా..?

విజయనగరం జిల్లాలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్...

మేనత్త ఊరిలో జగన్‌కు...

వైకాపా అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్...

న్యోమాలో అద్భుత ల్యాండింగ్.....

భారత వాయుసేన అరుదైన ఘనత సాధించింది....

ప్రాదేశిక పోరులో కూటమి...

ఏపీలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో...

పోల్స్