Sunday, November 8, 2026 11:25 PM
Sunday, November 8, 2026 11:25 PM

ప్రాదేశిక పోరులో కూటమి దూకుడు.. కానీ..!

ఏపీలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కూటమి హవా కొనసాగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు గురువారం పోలింగ్ నిర్వహించగా.. భారీ భద్రత మధ్య కౌంటింగ్ చేపట్టారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన అధికారులు.. మధ్యాహ్నం నుంచి ఫలితాలను వెల్లడించారు. ఈ ఫలితాల్లో కూటమి పార్టీల అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ముఖ్యంగా టీడీపీ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో గెలిచారు. కడప జిల్లాలోని పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి 1,463 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దాదాపు అన్ని జిల్లా పరిషత్ స్థానాలు కూటమి ఖాతాలోనే చేరాయి. కనీసం ఒక్క జిల్లాలో కూడా వైసీపీ అభ్యర్థులు మెజారిటీ సాధించలేకపోయారు.

Also Read : వివాదాస్పదంగా మారిన మేడం గారి శాఖ..!

పల్నాడు జిల్లా నరసరావుపేట ఏఎం రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో జరుగుతున్న ఓట్ల లెక్కింపులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సత్తెనపల్లి మండలం కంకాణలపల్లి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్ బాక్స్‌లో ఓట్లతో పాటు కరపత్రాలను కౌంటింగ్ సిబ్బంది గుర్తించారు. గ్రామానికి వెళ్లే రహదారిలో రైల్వే గేటు వద్ద యూ ఆకారం అండర్ పాస్ రైల్వే బ్రిడ్జి వద్దంటూ అందులో విన్నవించారు. అండర్ పాస్ రైల్వే బ్రిడ్జి యూ ఆకారంలో నిర్మిస్తే ఇబ్బంది పడతామని గ్రామస్థులు పేర్కొన్నారు. ప్రధాన రహదారికి బ్రిడ్జిని అనుసంధానం చేసేలా నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.

Also Read : వరుసగా రెండవసారి.. పులివెందుల జెడ్పీటీసీ స్థానంపై పసుపు జెండా..!

కౌంటింగ్‌కు ముందే గుండెపోటుతో కన్నుమూసిన జనసేన అభ్యర్థికి ఎన్నికల ఫలితాల్లో విజయం వరించింది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతుని గూడెం గ్రామానికి చెందిన గారపాటి దివ్య జనసేన పార్టీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కావడానికి ముందే ఆమె గుండెపోటుతో మరణించారు. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో దివ్య విజయం సాధించినట్లు వెల్లడైంది. వైసీపీ అభ్యర్థిపై 352 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు. ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ ఆ ఆనందాన్ని ఆస్వాదించడానికి దివ్య లేకపోవడం గ్రామస్థులను కలచివేస్తోంది. గెలుపు వార్త తెలిసిన తర్వాత గ్రామంలో ఆనందం కంటే విషాదమే ఎక్కువగా కనిపిస్తోంది. దివ్యకు ప్రేమ వివాహం కాగా, ఆమెకు ఐదేళ్లు. మూడు నెలల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

మేనత్త ఊరిలో జగన్‌కు...

వైకాపా అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్...

న్యోమాలో అద్భుత ల్యాండింగ్.....

భారత వాయుసేన అరుదైన ఘనత సాధించింది....

తెలంగాణ కాంగ్రెస్‌లో ముదిరిన...

కాంగ్రెస్ పార్టీ అంటేనే.. వర్గ పోరుకు...

వరుసగా రెండవసారి.. పులివెందుల...

వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో...

తెలంగాణ పల్లెలకు డిజిటల్...

తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలను డిజిటల్‌గా బలోపేతం...

వివాదాస్పదంగా మారిన మేడం...

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన...

పోల్స్