Saturday, November 7, 2026 02:49 PM
Saturday, November 7, 2026 02:49 PM

వరుసగా రెండవసారి.. పులివెందుల జెడ్పీటీసీ స్థానంపై పసుపు జెండా..!

వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చారిత్రక విజయాన్ని నమోదు చేసి రాజకీయంగా సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని కోటగా చెప్పుకునే పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో టీడీపీ అభ్యర్థి భారతి 1,463 ఓట్ల స్పష్టమైన మెజారిటీతో ప్రత్యర్థిపై విజయం సాధించి పులివెందుల పీఠంపై పసుపు జెండాను ఎగురవేశారు. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ ఎన్నికల్లో.. పోలింగ్ రోజున నాటికియ పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

Also Read : వివాదాస్పదంగా మారిన మేడం గారి శాఖ..!

ఈ విజయం ఊహించని పరిణామం కాగా, పులివెందులలో టీడీపీ వరుసగా రెండవసారి జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం. గతంలో జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిపై విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఇప్పుడు జరిగిన సాధారణ స్థానిక సంస్థల పోరులోనూ అదే విజయ పరంపరను కొనసాగిస్తూ, వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుని పులివెందులలో టీడీపీ సంచలనం సృష్టించింది.

Also Read : ఆ రూ.14.20 కోట్ల ప్లేయర్‌ను వదలొద్దు..!

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఓట్ల లెక్కింపు వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బూత్ ఆక్రమణలు, అక్రమాలు జరిగాయంటూ వైఎస్ జగన్ నేరుగా ఆర్వో కార్యాలయం వద్ద నిరసనకు దిగి, రీ-పోలింగ్‌కు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వివాదాలు మరియు ఉద్రిక్తతల నడుమ వెలువడిన ఫలితాల్లో టీడీపీ అభ్యర్థి వరుసగా రెండోసారి పీఠాన్ని దక్కించుకోవడం కూటమి వర్గాల్లో ఉత్సాహాన్ని నింపగా, వైఎస్సార్‌సీపీ వర్గాలకు మాత్రం మింగుడుపడని పరిణామంగా మారింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

తెలంగాణ పల్లెలకు డిజిటల్...

తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలను డిజిటల్‌గా బలోపేతం...

వివాదాస్పదంగా మారిన మేడం...

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన...

చీరాలలో వైసీపీ కొంపముంచిన...

బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ ఎన్నికల...

అనంతపురంలో టెన్షన్ టెన్షన్.....

రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ పరిషత్ ఎన్నికల...

అసెంబ్లీ కంటే ఘోరం.....

ఏపీలో మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు...

ఓటర్లకు ఈసీ బిగ్...

ఓటర్ల జాబితా నుంచి పేర్లు గల్లంతైన...

పోల్స్