Saturday, November 7, 2026 03:41 PM
Saturday, November 7, 2026 03:41 PM

తెలంగాణ కాంగ్రెస్‌లో ముదిరిన సంక్షోభం..!

కాంగ్రెస్ పార్టీ అంటేనే.. వర్గ పోరుకు కేరాఫ్ అడ్రస్. అధికారంలో ఉన్నా లేకున్నా.. నేతల మధ్య మాత్రం ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంటుంది. వరుసగా పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ నేతల తీరులో మార్పు రాలేదు. గెలుపు కోసం నానా పాట్లు పడిన విషయాన్ని మర్చిపోయినట్లున్నారు. ప్రతిపక్షంలో ఉన్న భారత రాష్ట్ర సమితి‌ని వీళ్లే దగ్గరుండి గెలిపించేలా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మధ్య తలెత్తిన వివాదం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఇద్దరు నేతల వ్యవహార శైలిపై సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నారు. దాన్ని కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Also Read : చీరాలలో వైసీపీ కొంపముంచిన ఆమంచి..!

ఇద్దరు నేతల మధ్య ఢిల్లీలో జరిగిన వివాదం పార్టీ ప్రతిష్ఠకు ఇబ్బందికరంగా మారడంతో మహేశ్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. వివరణ ఇచ్చేందుకు గాంధీభవన్‌కు రావాలని మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావులను ఆదేశించా రు. ఈ నేపథ్యంలో ఇద్దరితో విడివిడిగా మాట్లాడేందుకు ఆయన సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే ముందుగా సమావేశానికి వస్తానని చెప్పిన మంత్రి దామోదర రాజనర్సింహ చివరి నిమిషంలో రావడం లేదని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో అసహనానికి గురైన పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావుతో జరగాల్సిన సమావేశాన్ని కూడా రద్దు చేసుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆహ్వానించినా కూడా సమావేశానికి ప్రజాప్రతినిధులు హాజరుకాకపోవడంపై మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఢిల్లీలో జరిగిన వివాదం, అనంతరం గాంధీభవన్లో విచారణకు హాజరుకాకపోవడం వంటి పరిణామాలను మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు నేతల మధ్య వివాదానికి దారి తీసిన పరిస్థితులు, వారి వ్యవహార శైలిపై వివరాలు సేకరిస్తున్నారు. సమగ్ర సమాచారంతో నివేదిక రూపొందించి ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నివేదికపై అధిష్టానం ఎలా స్పందిస్తుందనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Also Read : పెట్రోల్‌లో అధిక ఇథనాల్.. ఆయిల్ కంపెనీల కీలక ప్రకటన..!

మంత్రి, ఎమ్మెల్యే మధ్య విభేదాలకు సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి నియామకమే ప్రధాన కారణమని తెలుస్తోంది. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు స్వస్థలం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్. ఇటీవల ఆ జిల్లా డీసీసీ అధ్యక్షుడి నియామకంలో లక్ష్మీ కాంతారావు తన వర్గానికి చెందిన నేతకు మద్దతు తెలిపినట్లు సమాచారం. మరో జిల్లా ఎమ్మెల్యే అయిన లక్ష్మీ కాంతారావు తన జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకోవడంపై మంత్రి దామోదర అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల ఢిల్లీలోని రామ్‌ లీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీ సందర్భంగా ఈ వివాదం మరింత ముదిరినట్లు తెలుస్తోంది. ఆ కార్యక్రమానికి వెళ్లిన సమయంలో ఓ హోటల్లో మంత్రి దామోదర రాజనర్సింహను ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు పలకరించినట్లు సమాచారం. ఆ సమయంలో మంత్రి తీవ్ర పదజాలంతో దూషించడంతోపాటు బెదిరింపులకు పాల్పడ్డారని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి నట్లు ప్రచారం జరిగింది.

ఈ వ్యవహారం పత్రికలు, సామాజిక మాధ్యమాల్లోనూ విస్తృతంగా చర్చకు వచ్చింది. తాజాగా గాంధీభవన్ సమావేశాలకు ఇద్దరు నేతలు హాజరు కాకపోవడంతో వివాదం మరో మలుపు తిరిగింది.ఇప్పటికీ ఢిల్లీలో జరిగిన ఘటనతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న పార్టీకి తాజా పరిణామాలు మరింత తలనొప్పిగా మారాయి. అధిష్టానానికి నివేదిక పంపిన తర్వాత ఈ వివాదంపై పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

వరుసగా రెండవసారి.. పులివెందుల...

వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో...

తెలంగాణ పల్లెలకు డిజిటల్...

తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలను డిజిటల్‌గా బలోపేతం...

వివాదాస్పదంగా మారిన మేడం...

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన...

చీరాలలో వైసీపీ కొంపముంచిన...

బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ ఎన్నికల...

అనంతపురంలో టెన్షన్ టెన్షన్.....

రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ పరిషత్ ఎన్నికల...

అసెంబ్లీ కంటే ఘోరం.....

ఏపీలో మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు...

పోల్స్