విజయనగరం జిల్లాలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు, మాజీ మంత్రులకే ఓటర్లు షాక్ ఇచ్చారు. చీపురుపల్లి నియోజకవర్గానికి చెందిన టీడీపీ మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు, వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబాలు ఇప్పుడు తమ రాజకీయ వారసత్వం, భవిష్యత్తుపై వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. దాదాపు 30 ఏళ్లు పైగా రాజకీయాల్లో కొనసాగుతున్న ఈ రెండు కుటుంబాలకు.. ఇప్పుడు తమ వారసుల విజయాల్లో మాత్రం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రెండు కుటుంబాల నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన వారసులకు ఓటర్ ఊహించని విధంగా స్ట్రోక్ ఇచ్చారు.
Also Read : మేనత్త ఊరిలో జగన్‌కు షాక్.. 20 ఏళ్ల ఆధిపత్యానికి బ్రేక్!
కిమిడి కళా వెంకట్రావు, బొత్స సత్యనారాయణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఉత్తరాంధ్ర ప్రాంతానికే చెందిన వారైనప్పటికీ.. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. 1983లోనే టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు కళా. ఆ తర్వాత నాలుగేళ్లు మంత్రిగా కూడా పని చేశారు. రాజ్యసభ సభ్యునిగా, టీటీడీ ఛైర్మన్‌గా కూడా పని చేసిన అనుభవం. ఇక బొత్స సత్యనారాయణ కూడా 1999లో ఎంపీగా గెలిచారు. ఆ తర్వత కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. వైఎస్ఆర్ నమ్మినబంటుగా ముద్ర పడటంతో.. పదేళ్లు మంత్రిగా కొనసాగారు. ేఇక్కడ మరో మరో విషయం ఏమిటంటే.. ఈ ఇద్దరు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా పని చేసిన వారే.
Also Read : న్యోమాలో అద్భుత ల్యాండింగ్.. చరిత్ర సృష్టించిన వాయుసేన!
బొత్స ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా వ్యవహరిస్తే.. 2014లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా కళా వెంకట్రావు పని చేశారు. ఇద్దరికీ రాష్ట్రస్థాయి పరిచయాలు ఉన్నాయి. ఈ ఇద్దరికీ గెలుపు ఓటములు కొత్త కాదు. కళా వెంకట్రావు 2009, 2019లో ఓడిపోయారు. బొత్స సత్యనారాయణ 2014, 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఇద్దరికీ ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు ఊహించని షాక్ ఇచ్చాయి. రాజకీయాల నుంచి రిటైర్ అవుదామనుకునే భావనలో ఉన్న ఇద్దరు నేతలకు వారసుల రూపంలో షాక్ తగిలింది.
తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కళా వెంకట్రావు కోడలు టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమె పైన బొత్స సత్యనారాయణ కోడలే వైసీపీ జడ్పీటీసీ అభ్యర్ధిగా పోటీచేసి విజయం సాధించారు. అప్పుడేమో మామలు ఎమ్మెల్యేలుగా.. ఇప్పుడేమో కోడళ్ళు జడ్పీటీసీలుగా పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అప్పుడు టీడీపీ మామ బొత్స ఓడిపోతే.. ఇప్పుడు కొడలు బొత్స గెలిచి అందుకు బదులు తీర్చుకున్నారు. అప్పుడు మామ కిమిడి గెలిస్తే.. ఇప్పుడేమో కోడలు కిమిడి ఓడిపోయారు. అయితే ఈ ఎన్నికల్లో బొత్సకు మరో ఊహించని షాక్.. కుమార్తె ఓటమి. ఫ్యూచర్ ఎమ్మెల్యే అని భావించిన బొత్స అనూష మాత్రం ఓ సాధారణ మహిళ చేతుల్లో ఘోరంగా ఓడిపోయారు.
Also Read : తెలంగాణ కాంగ్రెస్‌లో ముదిరిన సంక్షోభం..!
కోడలును జెడ్పీటీసీగా పోటీ చేయించిన కళా వెంకట్రావుకు ఓటమి షాక్ ఇవ్వగా.. కుమార్తె గెలుపుతో కాలర్ ఎగరేద్దామనుకున్న బొత్సను విజయనగరం ఓటర్లు పక్కన పెట్టేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరి పరువు పోయినట్లుగా అయ్యింది. ఈ ఇద్దరు ప్రముఖులకు రాజకీయంగా, ఓటర్లిచ్చిన షాక్‌లతో దిమ్మ తిరిగినట్లైంది. అపార రాజకీయం అనుభవం ఉన్న మాజీ మంత్రులు కిమిడి, బొత్స.. తమ తమ పార్టీల అధినేతల దృష్టిలో పలుచన అయినట్లు అయ్యింది. కోడలి ఓటమితో చంద్రబాబు దృష్టిలో కళా వెంకట్రావు, కుమార్తె ఓటమితో జగన్ దగ్గరర బొత్స పరువు పూర్తిగా పోయిందనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఈ ఇద్దరు ప్రముఖులకు రాజకీయంగా ఎదురైన షాక్ నుండి ఎప్పుడు తెరుకుంటారో..?


