Monday, November 9, 2026 06:27 PM
Monday, November 9, 2026 06:27 PM

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం.!

సామాన్యులకు ప్రజాస్వామ్యంలో స్థానం ఉందని స్థానిక సంస్థల ఎన్నికలు నిరూపించాయి. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వెలువడిన ఫలితాలు సరిగ్గా ఇదే విషయాన్ని మరోసారి రుజువు చేశాయి. సాధారణ జీవితం గడిపే కష్టజీవులు కూడా ప్రజామోదం పొంది విజయం సాధించవచ్చని పెనమలూరు-1, పెనమలూరు-2 ఎంపీటీసీ స్థానాల ఫలితాలు చాటిచెప్పాయి.

Also Read : పెద్ద నోట్ల రద్దుపై చంద్రబాబు సంచలన కామెంట్స్..!

పెనమలూరు-2 MPTC స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన శీలం ఆనంద్ రిక్షా కార్మికుడు కావడం విశేషం. ఎన్నికల ప్రచారంలోనూ తన జీవనాధారమైన రిక్షాపైనే తిరిగి ఓటర్లను అభ్యర్థించిన ఆనంద్, భారీ విజయం సాధించి ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. ఇక పెనమలూరు-1 స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బాదావత్ వేంకటేశ్వరరావు వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. ఈ ఎన్నికల్లో గెలుపొందిన ఆయన, రిజర్వేషన్ సమీకరణాల దృష్ట్యా పెనమలూరు MPP రేసులో ముందంజలో ఉన్నారు.

ఈ రెండు స్థానాల ఫలితాల్లో మరో ఆసక్తికరమైన అంశం చోటుచేసుకుంది. గెలిచిన టీడీపీ అభ్యర్థుల పేర్లు ఆనంద్, వేంకటేశ్వరరావు కాగా, వారి చేతిలో ఓడిపోయిన వైసీపీ అభ్యర్థుల పేర్లు కూడా ఆనంద్, వేంకటేశ్వరరావు కావడం గమనార్హం. ఈ విచిత్రమైన పోలిక స్థానికంగా, పొలిటికల్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.

Also Read : ట్రేడింగ్ విండోలో గుజరాత్ టైటాన్స్ భారీ స్కెచ్..!

సాధారణ రిక్షా కార్మికుడిని, ఆటో డ్రైవర్‌ను ప్రోత్సహించి చట్టసభలు, స్థానిక పీఠాలు అధిరోహించే స్థాయికి చేర్చడం పట్ల స్థానిక ప్రజల్లో తీవ్ర హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు నివ్వడంలో TDPకి సాటిలేదని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

పెద్ద నోట్ల రద్దుపై...

దేశంలో, రాష్ట్రంలో వేళ్లూనుకుపోయిన అవినీతిని సమూలంగా...

బ్రేకింగ్: ఉద్యోగులకు చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం...

ట్రేడింగ్ విండోలో గుజరాత్...

ఐపీఎల్ 2027 వేలానికి ముందే ఫ్రాంచైజీల...

ఓట్ల శాతం, సీట్ల...

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై...

మిడ్‌టర్మ్ ఎన్నికల ఓటమిపై...

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ...

ఏపీలో మరో ఎన్నికల...

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, కార్పొరేషన్, జడ్పీటీసీ, ఎంపీటీసీ...

పోల్స్