Thursday, November 12, 2026 11:34 AM
Thursday, November 12, 2026 11:34 AM

ఏపీకి భారీ పెట్టుబడుల వెల్లువ.. మరో ప్రముఖ కంపెనీ ఎంట్రీ..!

ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీ రంగంలో మరో చారిత్రక ముందడుగు పడింది. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్‌తో ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థ రెన్యూ చైర్మన్, సీఈవో సుమంత్ సిన్హా భేటీ అయ్యారు. ఈ చర్చల అనంతరం రాష్ట్రంలో మరో రెండు భారీ ప్రాజెక్టుల ద్వారా అదనంగా రూ.29,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రెన్యూ సంస్థ సూత్రప్రాయంగా అంగీకరించింది.

Also Read : చీరకట్టులో చిచ్చుబుడ్డిలా ప్రగ్యా జైస్వాల్

తాజా ఒప్పందంలో భాగంగా, రూ.12,500 కోట్ల వ్యయంతో 2 గిగావాట్ల సామర్థ్యం గల పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టును సంస్థ ఏర్పాటు చేయనుంది. విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు నీటిని ఎగువ రిజర్వాయర్‌లోకి పంప్ చేసి, డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో టర్బైన్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది. దీనితో పాటు, రూ.17,000 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక గ్రీన్ అమ్మోనియా మరియు ఈ-ఫ్యూయల్ తయారీ ప్రాజెక్టును కూడా నెలకొల్పేందుకు రెన్యూ ముందుకు వచ్చింది.

Also Read : జెడ్పీటీసీ ఎన్నికల్లో వాళ్లే హీరోలు..!

2015లో కళ్యాణదుర్గంలో 24 మెగావాట్ల పవన విద్యుత్ కేంద్రంతో ఏపీలో అడుగుపెట్టిన రెన్యూ, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 10 ప్రాంతాల్లో 717 మెగావాట్ల పవన, 60 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను నిర్వహిస్తోంది. ఇప్పటికే అనంతపురం జిల్లా గుంతకల్లులో రూ.22,000 కోట్లతో దేశంలోనే అతిపెద్ద హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టును, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో రూ.85,200 కోట్లతో 1,000 మెగావాట్ల గ్రీన్ డేటా సెంటర్‌ను, రాంబిల్లిలో 6.5 గిగావాట్ల సోలార్ ఇంగోట్-వేఫర్ ప్లాంట్‌ను, రూ.11,000 కోట్లతో పాలీసిలికాన్ ప్రాజెక్టులను సంస్థ చేపడుతోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఆ ఎమ్మెల్యేకు రాజకీయ...

తప్పు చేస్తే.. అందుకు శిక్ష వెంటనే...

లోకేష్ కు పవన్...

విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 31వ సీఐఐ...

జెడ్పీటీసీ ఎన్నికల్లో వాళ్లే...

ఏపీలో జెడ్పీటీసీ ఎన్నికలు ముగిశాయి. మరో...

తెర‌ వెనుక ‘పవర్...

ఒకప్పుడు చంద్రబాబు నాయుడికి ‘కుడిభుజం’గా, పార్టీ...

బ్రేకింగ్: ఏపీలో మళ్లీ...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి...

జగన్ అక్రమాస్తుల కేసుల్లో...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల...

పోల్స్