Friday, November 13, 2026 12:21 PM
Friday, November 13, 2026 12:21 PM

లోకేష్ వర్సస్ వైసీపీ.. ఎవరు గెలుస్తారో..?

మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మంత్రి నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. మేయర్ స్థానం ఎస్టీలకు రిజర్వ్ కావడంతో టీడీపీ, వైసీపీ వ్యూహాలపై ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికలు లోకేష్‌కు ఎమ్మెల్యేగా తొలి స్థానిక సంస్థల ఎన్నికల పరీక్షగా మారనున్నాయి. రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన రాజధాని ప్రాంత పరిధిలోని మంగళగిరి- తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి.

Also Read : పారిశ్రామిక రంగంలో గేమ్ ఛేంజర్.. చంద్రబాబు బిగ్ స్టెప్..!

రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన నియోజకవర్గంగా ఉన్న మంగళగిరిలో ఈ కార్పొరేషన్‌కు తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్ర మంత్రి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతంలో మున్సిపల్ పోరు రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వంద పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 13 కార్పొరేషన్లు ఉండగా, 12 కార్పొరేషన్లను కూటమి గెలుచుకుంది. ఇప్పుడు నాలుగు కార్పొరేషన్లకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, అందరి దృష్టిని మంగళగిరి – తాడేపల్లి కార్పొరేషన్ ఆకర్షిస్తోంది. కొంతకాలంగా మంగళగిరి రాజకీయాల్లో నారా లోకేశ్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిన లోకేశ్, ఆ తర్వాత నియోజకవర్గ ప్రజలతో మమేకై బలమైన నాయకుడిగా ఎదిగారు. ఫలితంగా 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోనే మూడో అత్యధిక మెజార్టీతో ఘనవిజయం సాధించి చరిత్ర సృష్టించారు.

ప్రస్తుతం మంత్రిగా అభివృద్ది సంస్కరణలను వేగవంతం చేయడంతో పాటు మంగళగిరి నియోజకవర్గంలో పట్టు మరింత బిగించారు లోకేష్. నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలతోనూ అనుబంధం పెంచుకునేలా పాలన సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి కుమారుడిగా రాష్ట్రంలో అత్యంత కీలక స్థానంలో ఉన్న లోకేష్ మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలి పరీక్షను ఎదుర్కొంటున్నారు. అయితే ఇందులో ఆయనకు పెద్ద సవాళు ఎదురయ్యే అవకాశాలు ఏవీ కనిపించక పోయినప్పటికీ, ఇంకా క్షేత్రస్థాయిలో వైసీపీ బలం తెలుసుకునే అవకాశం ఈ ఎన్నికల ద్వారా లభించినట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. వైసీపీకి వచ్చే ఓట్లను బట్టి లోకేష్ పనితీరును అంచనా వేయవచ్చని అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు, ఈ నియోజకవర్గంలో తన ఉనికిని కాపాడుకోవడానికి వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ పార్టీ పూర్తిగా చతికిలపడటంతో కేడర్ నిస్తేజంగా మారిపోయిందని చెబుతున్నారు. మంత్రిగా లోకేష్ దూకుడు, నియోజకవర్గంలో ఆయన ప్రభావాన్ని తట్టుకోలేక వైసీపీ ఇప్పటికే నాయకత్వ పరంగా పలు మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగానే ఇప్పటివరకు నలుగురు ఇంచార్జులను మార్చినప్పటికీ, పార్టీలో నైతిక స్థైర్యం నింపడం ఆ పార్టీ అధినాయకత్వానికి సవాల్‌గా మారిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వైసీపీకి జీవన్మరణ పోరాటంగా మారాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కార్పొరేషన్ మేయర్ స్థానం ఎస్టీ వర్గానికి రిజర్వు కావడం అధికార తెలుగు దేశం పార్టీకి అదనపు బలంగా మారుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Also Read : హ్యుందాయ్ క్రెటా సరికొత్త లుక్.. మొదటిసారిగా స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌..!

ఎస్టీలకు రిజర్వు అయిన ఈ స్థానంలో టీడీపీ ఎవరిని అభ్యర్థిగా బరిలోకి దింపినా గెలుపు నల్లేరు మీద నడకలా సాగుతుందని భావిస్తున్నారు. నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, లోకేష్ నాయకత్వ ప్రభావం కారణంగా మెజారిటీ డివిజన్లలో టీడీపీ అభ్యర్ధులదే పైచేయి అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. అయితే, ఈ ప్రతికూల వాతావరణంలోనూ వైసీపీ ఏ స్థాయిలో పోరాడుతుందనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశమైంది. పార్టీ కేడర్‌ను సమాయత్తం చేసి అధికార పార్టీని ఏ విధంగా ఎదుర్కొంటుంది, బలమైన మేయర్ అభ్యర్థిని ఎంపిక చేయడంలో ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుందనేది ఆ పార్టీ భవిష్యత్తును నిర్ణయించనుందని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ, రాజధాని నడిబొడ్డున ఉన్న మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకోవడానికి జరిగే ఈ పోరు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ నిలుస్తోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

లోకల్ వార్‌లో మంత్రుల...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు...

ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.....

పల్నాడు రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి....

పారిశ్రామిక రంగంలో గేమ్...

విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య...

ఈసీ టార్గెట్ ఆ...

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న మిగిలిన పట్టణ...

ఏపీ లిక్కర్ స్కాంలో...

వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు...

ఆ ఎమ్మెల్యేకు రాజకీయ...

తప్పు చేస్తే.. అందుకు శిక్ష వెంటనే...

పోల్స్