Thursday, November 12, 2026 08:08 PM
Thursday, November 12, 2026 08:08 PM

హ్యుందాయ్ క్రెటా సరికొత్త లుక్.. మొదటిసారిగా స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌..!

భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మిడ్-సైజ్ ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా సరికొత్త నెక్స్ట్ జనరేషన్ మోడల్ భారత్‌లో టెస్టింగ్ చేస్తూ మొదటిసారి కెమెరాకు చిక్కింది. ‘SX3’ అనే కోడ్‌నేమ్‌తో రూపొందుతున్న ఈ 2027 మోడల్ బాహ్య రూపాన్ని కవర్‌తో పూర్తిగా దాచేసినప్పటికీ.. దీని అంతర్గత క్యాబిన్, డ్యాష్‌బోర్డ్ ఫీచర్లు మాత్రం లీక్ అయ్యాయి. సరికొత్త టెక్నాలజీ, అధునాతన ఇంటీరియర్స్‌తో వస్తున్న ఈ కారు 2027 మధ్య నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

Also Read : ఆ ఎమ్మెల్యేకు రాజకీయ పరీక్ష.. దెబ్బ అదుర్స్..!

ఈ తాజా స్పై షాట్స్ ప్రకారం.. కొత్త క్రెటా క్యాబిన్‌లో భారీ మార్పులు జరిగాయి. హ్యుందాయ్ తన సాంప్రదాయక కనెక్టెడ్ సింగిల్ స్క్రీన్ డిస్‌ప్లే విధానాన్ని పక్కనపెట్టి, ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు సరికొత్త స్లిమ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేను అమర్చింది. డ్రైవర్ డిస్‌ప్లేను డ్యాష్‌బోర్డ్‌పై కాస్త ఎత్తులో హెడ్-అప్ డిస్‌ప్లే శైలిలో ఉంచడం విశేషం. అంతేకాకుండా, ఇప్పటివరకు ఏ హ్యుందాయ్ మోడల్లోనూ లేని విధంగా టచ్ బటన్లు, ఫిజికల్ స్క్రోల్ వీల్స్, బ్రాండ్ యొక్క మోర్స్ కోడ్ ‘H’ లోగోతో కూడిన సరికొత్త స్టీరింగ్ వీల్‌ను ఇందులో పరిచయం చేస్తున్నారు.

Also Read : వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్..!

సాంకేతిక పరంగా కూడా ఈ కొత్త క్రెటా ఎంతో శక్తివంతంగా మారనుంది. కియా సెల్టోస్‌కు వాడే ‘K3’ ప్లాట్‌ఫారమ్‌పైనే ఈ 2027 క్రెటాను నిర్మిస్తుండటం వల్ల ఇది ప్రస్తుత మోడల్ కంటే కాస్త పెద్దదిగా, ఎక్కువ క్యాబిన్ స్పేస్‌తో రానుంది. అన్నింటికంటే ముఖ్యంగా, హ్యుందాయ్ సంస్థ ఈ కార్‌లో మొదటిసారిగా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆధారిత స్ట్రాంగ్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న 1.5-లీటర్ పెట్రోల్, టర్బో-పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు కూడా యథావిధిగా అందుబాటులో ఉంటాయి. సరికొత్త టెక్నాలజీ కారణంగా దీని ధర ప్రస్తుత మోడల్.. రూ. 10.79 లక్షల నుండి రూ. 19.95 లక్షలు కంటే కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.....

పల్నాడు రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి....

పారిశ్రామిక రంగంలో గేమ్...

విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య...

ఈసీ టార్గెట్ ఆ...

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న మిగిలిన పట్టణ...

ఏపీ లిక్కర్ స్కాంలో...

వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు...

ఆ ఎమ్మెల్యేకు రాజకీయ...

తప్పు చేస్తే.. అందుకు శిక్ష వెంటనే...

లోకేష్ కు పవన్...

విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 31వ సీఐఐ...

పోల్స్