Friday, November 13, 2026 06:33 AM
Friday, November 13, 2026 06:33 AM

ఈరోజు రాశి ఫలితాలు (13-11-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తిక మాసం, శుక్ల పక్షం.. 13-11-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

బంధువుల నుండి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వాహన ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. విద్యా విషయాలు నిరాశ కలిగిస్తాయి.
————————–

వృషభం

అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. నూతన వస్త్రా వస్తు లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. వాహన యోగం ఉన్నది. సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి.
————————–

మిధునం

వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయం తీసుకోలేరు. మానసికంగా ఆలోచనలు ఇబ్బందికి గురిచేస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృధా ఖర్చులు చేస్తారు.
————————–

కర్కాటకం

వృత్తి వ్యాపారాలలో దైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. ఉద్యోగమున నూతన అవకాశములు అందుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. కుటుంబ విషయంలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది.
————————–

సింహం

వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబమున కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
————————–

కన్య

వృత్తి ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. ఆర్థిక పరమైన చిక్కులు నుండి బయటపడతారు. వ్యాపారాలలో అంచనాలను దాటి లాభాలు అందుతాయి. నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తిచేస్తారు.
————————–

తుల

బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో పూర్తిచేస్తారు. ధనపరంగా ఇబ్బందులను అధిగమించి ఋణాలు సైతం తీర్చగలుగుతారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
————————–

వృశ్చికం

వృత్తి ఉద్యోగాలలో మేలైన సౌకర్యాలను పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
————————–

ధనస్సు

అనుకున్న సమయానికి పనులు పూర్తికావు. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధు మిత్రులతో చిన్న చిన్న తగాదాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇతరులపై మీ ఆలోచనా విధానం మార్చుకోవడం మంచిది.
————————–

మకరం

ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన వస్తు వాహన సౌకర్యాలు లభిస్తాయి. ఆర్థిక పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణ సూచనలున్నవి. ధనాదాయం పెరుగుతుంది. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.
————————–

కుంభం

సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో పెద్దల సలహాలను తీసుకోవడం మంచిది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు.
————————–

మీనం

ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉండి శిరో బాధలు పెరుగుతాయి. ధన విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.
————————–

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహన కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.....

పల్నాడు రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి....

పారిశ్రామిక రంగంలో గేమ్...

విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య...

ఈసీ టార్గెట్ ఆ...

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న మిగిలిన పట్టణ...

ఏపీ లిక్కర్ స్కాంలో...

వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు...

ఆ ఎమ్మెల్యేకు రాజకీయ...

తప్పు చేస్తే.. అందుకు శిక్ష వెంటనే...

లోకేష్ కు పవన్...

విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 31వ సీఐఐ...

పోల్స్