Monday, November 16, 2026 08:01 PM
Monday, November 16, 2026 08:01 PM

కోస్తాంధ్ర తీరాన్ని ఈనెల 20న తేదీన తాకనున్న తీవ్ర తుఫాను

ఇప్పటికే 2 తుపాన్లతో అల్లాడుతున్న ఏపీ ప్రజలను మరో తుఫాన్ పలకరించబోతుంది. దీని పై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 20 తేదీన కోస్తాంధ్రను తాకనున్న తుఫానుపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర వాయుగుండం మరింత బలపడి ఇవాళ సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో తీవ్ర వాయుగుండం ప్రస్తుత పరిస్థితిపై సీఎం సమీక్ష నిర్వహించారు.

Also Read : తిరుమల నీటి కష్టాన్ని తీర్చిన ప్రాజెక్టు గురించి తెలుసా..?

దీని పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. కేంద్ర బృందం చేసిన సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకుని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాను ప్రభావంతో ఈ నెల 19, 20 తేదీల్లో కోస్తాంధ్ర తీరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఆస్కారం ఉందని అధికారులు తెలిపారు. ఆర్నబ్ తరహాలోనే ఈ తుఫాను ప్రభావం కూడా ఉండే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

Also Read : ఏపీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో భయంకర నిజాలు..!

రానున్న తుఫాను కోనసీమ, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లా సహా వివిధ ప్రాంతాలపై ప్రభావం ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ముందుగానే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపటంతో పాటు విద్యుత్ సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించేలా సిబ్బందిని సిద్దంగా ఉంచుకోవాలని సీఎం సూచించారు. అలాగే భారీ వర్షాల వల్ల వస్తున్న వరద ప్రవాహాలను రిజర్వాయర్లకు మళ్లించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

మళ్ళీ మొదటికి వచ్చిన...

కృష్ణా జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్...

ఎన్విడియా వివాదం వేళ...

అంతర్జాతీయ టెక్నాలజీ, చిప్‌సెట్ రంగాల్లో ప్రముఖ...

స్థానిక సంస్థల రిజర్వేషన్లపై...

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపు,...

ఏపీ లిక్కర్ స్కామ్...

ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్న...

మేయర్ కుర్చీ.. సీనియర్లకు...

ఒక్క మేయర్ కుర్చీ.. మూడు పార్టీల...

ఎమ్మెల్యే గారూ.. ఓసారి...

మా ఎమ్మెల్యే ఎక్కడున్నారో మీరైనా చెప్పండయ్యా.....

పోల్స్