Monday, November 16, 2026 08:25 PM
Monday, November 16, 2026 08:25 PM

ఏపీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో భయంకర నిజాలు..!

ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్న మద్యం కుంభకోణం దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరించిన ఓ వ్యక్తి, కేవలం ఐదేళ్ల కాలంలోనే అక్షరాలా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు దర్యాప్తు సంస్థలు ప్రాథమిక అంచనాకు వచ్చాయి. ఒకప్పుడు కడప జిల్లాలో నెలకు పాతిక వేల రూపాయల జీతానికి విలేకరిగా పనిచేసిన ఆయన, జగన్ పార్టీ పెట్టిన తర్వాత సహాయకుడిగా చేరి అంచెలంచెలుగా ఎదిగారు.

Also Read : గిరిబాబు చివరి కోరిక నెరవేరింది.. రావినూతలలో కన్నీటి వీడ్కోలు

2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆయన వద్దే కొనసాగుతూ, ప్రభుత్వం నుంచి నెలకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు జీతభత్యాలు అందుకున్నారు. 2019 నాటికి ఆయన తన వార్షిక ఆదాయాన్ని రూ.64 లక్షలుగా ఐటీ రిటర్న్స్‌లో చూపించగా, ఆ తర్వాత ఐదేళ్లలో ఎవరూ ఊహించని రీతిలో ఆస్తులు పోగేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వ కాలంలో జరిగిన సుమారు మూడున్నర వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం తీగ లాగడంతో ఈ సంచలన వ్యవహారం బయటపడింది.

విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో ఆయన వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కొనుగోలు చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది. అధికారంలో ఉన్న సమయంలో పైరవీలు, సెటిల్మెంట్లు, కమీషన్ల వసూళ్ల ద్వారా భారీగా వెనకేసుకున్నారని, అవినీతికి పాల్పడే నేతలు సైతం ఆశ్చర్యపోయే స్థాయిలో ఆస్తులు కూడబెట్టారని దర్యాప్తు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ అక్రమ సంపాదన కేవలం దేశంలోనే కాకుండా విదేశాలకు కూడా తరలినట్లు సిట్ విచారణలో తేలింది.

Also Read : దిల్ రాజు పై పెయిడ్ ట్రోల్స్ నడిపిందెవరు?

ఇక్కడి అక్రమ సొమ్మును అమెరికాకు పంపి, అక్కడి నుంచి మళ్లీ సక్రమమైన మార్గాల్లో వెనక్కి రప్పించుకున్నట్లు ఆధారాలు లభించాయి. అంతేకాకుండా, తన బామ్మర్ది పేరు మీద ఉన్న ఓ కంపెనీలో భార్యను భాగస్వామిగా చేర్చి లావాదేవీలు నడిపినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ కేసులో మనీలాండరింగ్ కోణం, విదేశీ నిధుల మళ్లింపు స్పష్టంగా కనిపిస్తుండటంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి లోతైన విచారణ చేపట్టింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

మళ్ళీ మొదటికి వచ్చిన...

కృష్ణా జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్...

ఎన్విడియా వివాదం వేళ...

అంతర్జాతీయ టెక్నాలజీ, చిప్‌సెట్ రంగాల్లో ప్రముఖ...

కోస్తాంధ్ర తీరాన్ని ఈనెల...

ఇప్పటికే 2 తుపాన్లతో అల్లాడుతున్న ఏపీ...

స్థానిక సంస్థల రిజర్వేషన్లపై...

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపు,...

మేయర్ కుర్చీ.. సీనియర్లకు...

ఒక్క మేయర్ కుర్చీ.. మూడు పార్టీల...

ఎమ్మెల్యే గారూ.. ఓసారి...

మా ఎమ్మెల్యే ఎక్కడున్నారో మీరైనా చెప్పండయ్యా.....

పోల్స్