Monday, November 16, 2026 08:02 PM
Monday, November 16, 2026 08:02 PM

మళ్ళీ మొదటికి వచ్చిన విజయా డైరీ కథ.. అసలేం జరిగింది..?

కృష్ణా జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ పాలకవర్గ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. విజయ డెయిరీ బోర్డు ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే దాసరి వెంకట బాలవర్ధనరావు ఎన్నిక చెల్లదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఛైర్మన్‌తో పాటు మరో నలుగురు బోర్డు డైరెక్టర్ల ఎన్నికను కూడా రద్దు చేస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడంతో కృష్ణా జిల్లా రాజకీయ మరియు సహకార రంగాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.

Also Read : స్థానిక సంస్థల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఇటీవల విజయ డెయిరీ ఛైర్మన్ పదవికి చలసాని ఆంజనేయులు రాజీనామా చేసిన అనంతరం, ఆ స్థానంలో గన్నవరానికి చెందిన దాసరి బాలవర్ధనరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, దాసరి బాలవర్ధనరావుతో పాటు బోర్డు డైరెక్టర్లుగా ఎన్నికైన సాయి, పాలడుగు నాని, నాగేశ్వరరావు, శైలజ ఎన్నికల చెల్లుబాటును సవాలు చేస్తూ పలువురు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సమయంలో ఈ ఐదుగురు బోర్డు సభ్యులపై పోటీ చేసిన అభ్యర్థులను డిఫాల్టర్లుగా ప్రకటించడం వల్లే వీరి ఎన్నిక జరిగిందని, ఇది నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Also Read : పంచాయతీ పోరు.. ఇది కూడా పోతే.. ఇక అంతే..!

ఈ పిటిషన్లపై సుదీర్ఘ విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం, ఎన్నికల ప్రక్రియలో జరిగిన లోపాలను తీవ్రంగా పరిగణించింది. పోటీ చేసిన అభ్యర్థులను అనర్హులుగా తేలుస్తూనే, ఛైర్మన్ దాసరి బాలవర్ధనరావు సహా ఐదుగురు డైరెక్టర్ల ఎన్నిక చెల్లదని తుది తీర్పు ఇచ్చింది. మరోవైపు, విజయ డెయిరీ పాలకమండలి ఏర్పాటుకు, నిర్ణయాలకు మొత్తం 10 మంది సభ్యుల కోరం అవసరం కాగా, ప్రస్తుతం 8 మంది సభ్యులు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. హైకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో బోర్డు తదుపరి కార్యాచరణ, పరిపాలనా వ్యవహారాలపై చర్చించేందుకు అత్యవసర సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఎన్విడియా వివాదం వేళ...

అంతర్జాతీయ టెక్నాలజీ, చిప్‌సెట్ రంగాల్లో ప్రముఖ...

కోస్తాంధ్ర తీరాన్ని ఈనెల...

ఇప్పటికే 2 తుపాన్లతో అల్లాడుతున్న ఏపీ...

స్థానిక సంస్థల రిజర్వేషన్లపై...

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపు,...

ఏపీ లిక్కర్ స్కామ్...

ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్న...

మేయర్ కుర్చీ.. సీనియర్లకు...

ఒక్క మేయర్ కుర్చీ.. మూడు పార్టీల...

ఎమ్మెల్యే గారూ.. ఓసారి...

మా ఎమ్మెల్యే ఎక్కడున్నారో మీరైనా చెప్పండయ్యా.....

పోల్స్