Wednesday, November 18, 2026 12:31 PM
Wednesday, November 18, 2026 12:31 PM

తొలి టెస్టుకు ముందు శుభ్‌మన్ గిల్ సంచలన కామెంట్స్..!

న్యూజిలాండ్ గడ్డపై జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు టీమిండియా సర్వసన్నద్ధమైంది. నవంబర్ 19న వెల్లింగ్టన్ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్ట్ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక విషయాలను వెల్లడించాడు. ఈ సిరీస్‌లో తాము కచ్చితంగా నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగనున్నట్లు గిల్ స్పష్టం చేశాడు. ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ పేస్ విభాగంలో కీలకం కానుండగా, యువ పేసర్ అన్షుల్ కాంబోజ్‌పై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ ప్రత్యేక దృష్టి సారించారు.

Also Read : ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన ధోని, సీఎస్కేలో కొత్త ఇన్నింగ్స్..!

తుది జట్టు కూర్పుపై గిల్ మాట్లాడుతూ.. ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లతో ఆడే ఆలోచనలో ఉన్నామని, ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో బ్యాటింగ్ చేయగల ఆకాశ్ దీప్ లేదా అన్షుల్ కాంబోజ్‌లను పరిశీలిస్తున్నామని తెలిపాడు. వీరితో పాటు నితీష్ కుమార్ రెడ్డి కూడా బ్యాటింగ్ చేయగలడని పేర్కొన్నాడు. న్యూజిలాండ్ పిచ్‌లపై కుకబుర్రా బంతి పాతబడిన తర్వాత వికెట్లు తీయడం కష్టమవుతుందని, అందుకే పిచ్‌ పై బౌన్స్ ను సమర్ధవంతంగా వాడుకునే ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ వంటి పొడవాటి బౌలర్లు ఎంతో అవసరమని అతను అభిప్రాయపడ్డాడు.

Also Read : భారత్‌లో అమెజాన్ భారీ ప్లానింగ్.. ఏపీపై స్పెషల్ ప్లానింగ్..!

వెల్లింగ్టన్ మైదానంలో వీచే బలమైన గాలుల గురించి గిల్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అక్కడి వాతావరణం బ్యాటర్ల కంటే బౌలర్లపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందని అన్నాడు. గాలికి ఎదురుగా బౌలింగ్ చేయడం ఫాస్ట్ బౌలర్లను తీవ్రంగా అలసిపోయేలా చేస్తుందని, అందుకే సరైన బౌలింగ్ కాంబినేషన్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యమని వివరించాడు. న్యూజిలాండ్‌లో టెస్ట్ మ్యాచ్‌ను రెండు భిన్న దశలుగా విభజించి చూడాలని, మొదటి రెండు రోజులు ఒకలా, చివరి మూడు రోజులు మరోలా పిచ్ స్పందిస్తుందని గిల్ విశ్లేషించాడు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

వాహనదారులకు కేంద్ర రవాణాశాఖ...

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు...

జడ్పీ ఛైర్మన్ల సందడి.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ...

ఆ నలుగురే టీటీడీ...

తిరుమ తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్...

నా కూతురి పెళ్లి...

తన కుమార్తె వివాహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...

ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన...

భారత క్రికెట్ చరిత్రలో, ముఖ్యంగా ఐపీఎల్...

విజయ డెయిరీలో ఏం...

కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర...

పోల్స్