Tuesday, November 17, 2026 07:01 PM
Tuesday, November 17, 2026 07:01 PM

భారత్‌లో అమెజాన్ భారీ ప్లానింగ్.. ఏపీపై స్పెషల్ ప్లానింగ్..!

గ్లోబల్ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. దేశంలో స్వచ్ఛమైన ఇంధన వనరులను ప్రోత్సహించే లక్ష్యంతో పునరుత్పాదక ప్రాజెక్టుల్లో ఏకంగా సుమారు రూ. 65 వేల కోట్ల అదనపు పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ కసరత్తు చేస్తోంది. 2030 నాటికి ఈ భారీ పెట్టుబడులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆ సంస్థ, దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడంతో పాటు..

Also Read : నా కూతురి పెళ్లి పిలుపులోనూ రాజకీయాలా.. సాక్షిపై షర్మిల ఫైర్!

పర్యావరణ పరిరక్షణకు దోహదపడే గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించింది. అమెజాన్ ప్రకటించిన ఈ భారీ పెట్టుబడులపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధికి, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తున్న ఆంధ్రప్రదేశ్ వైపు అమెజాన్ దృష్టి సారించే అవకాశం ఉందనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. ఏపీలో ఉన్న పరిశ్రమల అనుకూల విధానాలు, విస్తారమైన వనరులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే అమెజాన్ ప్రతినిధులతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

Also Read : ఇరాన్ వార్నింగ్ లైట్ తీసుకున్న అమెరికా.. చివరకు ఏమైంది..?

గ్రీన్ ఎనర్జీ రంగంలోకి వస్తున్న ఈ రూ. 65 వేల కోట్ల నిధుల్లో సింహభాగం ఆంధ్రప్రదేశ్‌కు దక్కేలా మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులతో పాటు డేటా సెంటర్లు, ఐటీ మౌలిక సదుపాయాల కల్పనకు ఉన్న అవకాశాలను ఆయన అమెజాన్ యాజమాన్యానికి వివరించినట్లు తెలుస్తోంది. అమెజాన్ కనుక ఏపీ వైపు మొగ్గు చూపితే, రాష్ట్ర పారిశ్రామిక రంగానికి మరింత ఊతమివ్వడమే కాకుండా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఆ నలుగురే టీటీడీ...

తిరుమ తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్...

నా కూతురి పెళ్లి...

తన కుమార్తె వివాహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...

ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన...

భారత క్రికెట్ చరిత్రలో, ముఖ్యంగా ఐపీఎల్...

విజయ డెయిరీలో ఏం...

కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర...

జగన్ ఫేక్ ట్వీట్‌కు...

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై...

మళ్ళీ మొదటికి వచ్చిన...

కృష్ణా జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్...

పోల్స్