Tuesday, November 17, 2026 01:14 PM
Tuesday, November 17, 2026 01:14 PM

ఇరాన్ వార్నింగ్ లైట్ తీసుకున్న అమెరికా.. చివరకు ఏమైంది..?

అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో పెంటగాన్ చేసిన ఘోర తప్పిదం ఇప్పుడు సంచలనంగా మారింది. కువైట్‌లోని పోర్ట్ షువైబా కమాండ్ పోస్ట్‌పై మార్చి 1న ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఆరుగురు అమెరికా సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ దాడికి ముందే తమ స్థావరానికి సరైన రక్షణ లేదని తాను ఉన్నతాధికారులను హెచ్చరించినా వారు నిర్లక్ష్యం చేశారని ఆ దాడిలో గాయపడి ప్రాణాలతో బయటపడిన ఆర్మీ మేజర్ స్టీఫెన్ రామ్స్‌బాటమ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన అమెరికా కాంగ్రెస్‌కు విజిల్‌బ్లోయర్ ఫిర్యాదును అందజేశారు.

Also Read : ఎన్విడియా వివాదం వేళ భారత్ సంచలన నిర్ణయం.. చైనాకు మాస్టర్ స్ట్రోక్

తమ కమాండ్ పోస్ట్ కేవలం కారు బాంబులను ఆపడానికి మాత్రమే అనువుగా ఉందని, గగనతల లేదా డ్రోన్ దాడులను ఎదుర్కొనే ఎటువంటి రక్షణ వ్యవస్థలు అక్కడ లేవని రామ్స్‌బాటమ్ వెల్లడించారు. అంతేకాకుండా ఆ స్థావరంలో కనీసం ఒక డాక్టర్ కానీ, ప్రాథమిక చికిత్స కేంద్రం కానీ లేవని, కేవలం ఒకే ఒక్క అంబులెన్స్ మాత్రమే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భద్రతా లోపాల గురించి తాను రెండుసార్లు సెంట్రల్ కమాండ్ అధికారి మేజర్ జనరల్ జాన్ హిన్సన్ దృష్టికి తీసుకెళ్లినా, “రక్షణ గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అంటూ ఆయన కొట్టిపారేశారని రామ్స్‌బాటమ్ పేర్కొన్నారు.

Also Read : పెద్దలలో టైప్ 1 మధుమేహంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన మార్గదర్శకాలు..!

కౌంటర్-డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరినా పెంటగాన్ స్పందించలేదని ఆరోపించారు. మరోవైపు, ఆ దాడి జరిగిన మరుసటి రోజు అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్‌సేత్ మాట్లాడుతూ ఆ స్థావరానికి పటిష్టమైన భద్రత ఉందని, శత్రువుల శక్తివంతమైన ఆయుధం పొరపాటున లోపలికి చొచ్చుకువచ్చిందని సమర్థించుకున్నారు. కానీ తాజాగా బయటపడిన విజిల్‌బ్లోయర్ ఫిర్యాదుతో పెంటగాన్ వాదనలు అబద్ధమని తేలిపోయిందని సెనేటర్ రిచర్డ్ బ్లూమెంతల్ మండిపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు, అమెరికా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

విజయ డెయిరీలో ఏం...

కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర...

జగన్ ఫేక్ ట్వీట్‌కు...

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై...

మళ్ళీ మొదటికి వచ్చిన...

కృష్ణా జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్...

ఎన్విడియా వివాదం వేళ...

అంతర్జాతీయ టెక్నాలజీ, చిప్‌సెట్ రంగాల్లో ప్రముఖ...

కోస్తాంధ్ర తీరాన్ని ఈనెల...

ఇప్పటికే 2 తుపాన్లతో అల్లాడుతున్న ఏపీ...

స్థానిక సంస్థల రిజర్వేషన్లపై...

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపు,...

పోల్స్