Tuesday, November 17, 2026 06:06 PM
Tuesday, November 17, 2026 06:06 PM

ఆ నలుగురే టీటీడీ చైర్మన్ పదవి ఆశిస్తున్నారా..?

తిరుమ తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. ఎంతో ప్రాధాన్యత, గౌరవ, మర్యాదలున్న టీటీడీ చైర్మన్ పదవిని అందరూ కోరుకుంటారు. ప్రస్తుతం ఆ పదవిని కోరుకునే వారిలో టీడీపీకి చెందిన చాలా మంది ముఖ్యులు ఉన్నారనే మాట బాగా వినిపిస్తోంది. అందులో మాజీ మంత్రులు కూడా ఉన్నారు. ఆ మాజీ మంత్రుల్లో ఇద్దరు పార్టీలు మారిన వారు కూడా ఉన్నారు. ఒక సీనియర్ ఎమ్మెల్యే కూడా ఆ పదవిని కోరుకుంటున్నారు. మళ్లీ ఎన్నికల్లో పోటీచేయం.. మాకు టీటీడీ చైర్మన్‌గా స్వామికి సేవ చేయాలని ఉంది.. కాబట్టి.. ఈ సారి ఆ పదవిని మాకే ఇవ్వండి అంటూ ముగ్గురు టీడీపీ మాజీ మంత్రులు, ఒక ఎమ్మెల్యే పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు వినిపిస్తోంది.

Also Read : రాజస్థాన్ రాయల్స్‌కు యశస్వి జైస్వాల్ గుడ్‌బై..?

మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, కిమిడి కళా వెంకట రావు, గంటా శ్రీనివాసరావు.. సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవి రేసులో ఉన్నారు. వీరిలో గంటా శ్రీనివాసరావు, జ్యోతుల నెహ్రూ 3 పార్టీలు మారారు. కళా వెంకటరావు కూడా ప్రజారాజ్యం పార్టీలో చేరి.. మళ్లీ టీడీపీలోకి వచ్చారు. బీసీ కోటాలో యనమల, కళా వెంకట్రావు పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాపు కోటాలో గంటా, జ్యోతుల నెహు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్లలోనే యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు మంత్రి పదవులు ఆశించారు. కానీ.. వారిని పూర్తిగా పక్కన పెట్టారు. దీంతో ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవి కోసం యత్నిస్తున్నారు.

ముగ్గురు మాజీ మంత్రుల్లో యనమల రామకృష్ణుడుకు అవకాశం లేదు అనేది పార్టీ సీనియర్ నేతలతో పాటు రాజకీయ విశ్లేషకుల మాట. గతంలో టీటీడీ చైర్మన్‌గా యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ పని చేశారు. అలాగే ఇప్పుడు యనమల కుమార్తె దివ్య ఎమ్మెల్యేగా, అల్లుడు మహేశ్ యాదవ్ ఎంపీగా, సుధాకర్ యాదవ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఒకే కుటుంబంలో ఇన్ని పదవులు అనే మాట ఇప్పటికే బాగా వినిపిస్తోంది. దీంతో యనమలకు ఉన్న అన్ని గేట్లు మూత పడ్డాయనేది విశ్లేషకుల మాట. అయినా సరే.. తనకు రాజ్యసభ అవకాశం ఇవ్వలేదు కాబట్టి.. టీటీడీ ఇవ్వాలనేది యనమల డిమాండ్. రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తా.. ఈ ఒక్క పదవితో.. అని పదే పదే కోరుతున్నారు.

ఉత్తరాంధ్రలో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్న కిమిడి కళా వెంకట్రావు కూడా మంత్రి పదవి ఇవ్వలేదనే అసంతృప్తితో ఉన్నారు. ఇక రాదనేది పార్టీ సీనియర్ల మాట కూడా. కాబట్టి.. టీటీడీ చైర్మన్ పదవి అయినా ఇవ్వాలని కోరుతున్నారు. నిజానికి రాజకీయాల్లో అత్యున్నత పదవులన్నీ కళా వెంకట్రావు అనుభవించారు. ఢిల్లీలో రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. నామినేటెడ్ పోస్టులలో అత్యున్నతమైన టీటీడీ చైర్మన్‌గా కూడా గతంలో వ్యవహరించారు. మంత్రి పదవిలో హోమ్ మంత్రిగా కూడా కొనసాగారు. అలాగే పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా దాదాపు నాలుగున్నరేళ్లు పని చేశారు. ఇక ఆయనకు మిగిలింది డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రి పదవులే. కాబట్టి.. తనకు చివరి అవకాశం ఇవ్వాలనేది కళా వెంకట్రావు డిమాండ్.

Also Read : ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన ధోని, సీఎస్కేలో కొత్త ఇన్నింగ్స్..!

మంత్రి పదవిని తనకు ఇవ్వరు అని తెలుసుకున్న, అనేక పార్టీలు మారిన, టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా టీటీడీ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే.. టీటీడీ చైర్మన్ పదవిని కోరుకునే వారి జాభితా రోజురోజుకు చాంతాడులా పెరిగిపోతుంది. ఇంతకు టీటీడీ చైర్మన్ పదవి ఎవరికి దక్కనుందో..?. కొసమెరుపు ఏమిటంటే… టీటీడీ చైర్మన్ పదవి నియామకం ఇప్పుడు సీఎం చంద్రబాబు చేతుల్లో కూడా లేదనే మాట బాగా వినిపిస్తోంది. దీంతో.. ఎవరిని ప్రసన్నం చేసుకోవాలో.. వారి చుట్టూ నేతలంతా ఇప్పుడు ప్రదక్షిణలు చేస్తున్నారు. యనమలకు లేదనేది తేలిపోయింది. దీంతో.. మిగిలిన ముగ్గురిలో ఎవరికి అవకాశం ఇస్తారో అనే చర్చ నడుస్తోంది. బీసీ, కాపు ఈక్వేషన్‌లో కాటా ఎవరి వైపు మొగ్గు చూపుతుందో తేలాలంటే.. మరో రెండు నెలలు ఆగాల్సిందే.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

నా కూతురి పెళ్లి...

తన కుమార్తె వివాహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...

ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన...

భారత క్రికెట్ చరిత్రలో, ముఖ్యంగా ఐపీఎల్...

విజయ డెయిరీలో ఏం...

కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర...

జగన్ ఫేక్ ట్వీట్‌కు...

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై...

మళ్ళీ మొదటికి వచ్చిన...

కృష్ణా జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్...

ఎన్విడియా వివాదం వేళ...

అంతర్జాతీయ టెక్నాలజీ, చిప్‌సెట్ రంగాల్లో ప్రముఖ...

పోల్స్