Wednesday, November 18, 2026 12:32 PM
Wednesday, November 18, 2026 12:32 PM

వాహనదారులకు కేంద్ర రవాణాశాఖ షాకింగ్ న్యూస్..!

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర రవాణాశాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. వాహనాలకు సరైన ఇన్సూరెన్స్ లేకుండా రోడ్లపై తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సరికొత్త ఆటోమేటెడ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం ఇకపై ఇన్సూరెన్స్ గడువు ముగిసిన లేదా బీమా లేని వాహనాలు టోల్ ప్లాజాలను దాటితే తక్షణమే గుర్తించి భారీ జరిమానాలు విధించనున్నారు. ఈ విధానాన్ని ముందుగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఢిల్లీలోని అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-2 పై ఉన్న ముండ్కా టోల్ ప్లాజా వద్ద ప్రారంభించారు.

Also Read : నా కూతురి పెళ్లి పిలుపులోనూ రాజకీయాలా.. సాక్షిపై షర్మిల ఫైర్!

టోల్ ప్లాజా వద్ద వాహనం దాటిన వెంటనే దాని రిజిస్ట్రేషన్ వివరాలు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఆధ్వర్యంలోని వాహన్ డేటాబేస్‌తో ఆటోమేటిక్‌గా అనుసంధానమై తనిఖీ జరుగుతుంది. ఒకవేళ ఆ వాహనానికి చెల్లుబాటు అయ్యే థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ లేకపోతే, టోల్ దాటిన కొద్ది నిమిషాల్లోనే వాహన యజమాని రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ అలర్ట్ వెళ్తుంది. ఆ మెసేజ్‌లో వాహనం నంబర్, టోల్ దాటిన సమయం, ఇన్సూరెన్స్ గడువు ముగిసిన తేదీ వివరాలతో పాటు తక్షణమే పాలసీని రెన్యువల్ చేసుకోవాలనే హెచ్చరిక ఉంటుంది.

Also Read : జడ్పీ ఛైర్మన్ల సందడి.. కూటమి అగ్ర నేతల కీలక భేటీ..!

మోటారు వాహనాల చట్టం నిబంధనల ప్రకారం, ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడుపుతూ మొదటిసారి పట్టుబడితే వాహనం బేస్ ప్రీమియంకు మూడు రెట్లు లేదా కనీసం రూ. 5,000 జరిమానాగా విధిస్తారు. రెండోసారి లేదా ఆ తర్వాత కూడా ఇదే ఉల్లంఘనకు పాల్పడితే బేస్ ప్రీమియంకు ఐదు రెట్లు లేదా రూ. 10,000కు పైగా భారీ జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఢిల్లీ ముండ్కా టోల్ ప్లాజా వద్ద నిర్వహిస్తున్న ఈ ప్రయోగం విజయవంతమైతే రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాల వద్ద ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర రవాణాశాఖ నిర్ణయించింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

జడ్పీ ఛైర్మన్ల సందడి.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ...

ఆ నలుగురే టీటీడీ...

తిరుమ తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్...

నా కూతురి పెళ్లి...

తన కుమార్తె వివాహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...

ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన...

భారత క్రికెట్ చరిత్రలో, ముఖ్యంగా ఐపీఎల్...

విజయ డెయిరీలో ఏం...

కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర...

జగన్ ఫేక్ ట్వీట్‌కు...

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై...

పోల్స్