అమరావతిని అత్యాధునిక టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ఏపీ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ అండ్ ఎక్స్టెండెడ్ రియాలిటీ పాలసీ (2026-2031) ద్వారా రూ.5 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, కనీసం లక్ష మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా అమరావతిలో ప్రత్యేక పార్కు, అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కూడిన భారీ మీడియా సిటీని అభివృద్ధి చేయనుంది.
Also Read : మిశ్రాకు బ్రేకులు పడుతున్నాయా..?
ఈ రంగంలో దిగ్గజ సంస్థలను రాష్ట్రానికి రప్పించేలా ప్రభుత్వం పాలసీ నిబంధనలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 5 ప్రధాన యాంకర్ యూనిట్లతో పాటు 100 కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా కేవలం రాజధాని ప్రాంతమే కాకుండా, రాష్ట్రంలోని టైర్-2, టైర్-3 నగరాలకు కూడా ఈ అభివృద్ధి ఫలాలను విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాబోయే ఐదేళ్ల పాటు అమల్లో ఉండే ఈ పాలసీ ద్వారా సృజనాత్మక రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలవనుంది.
Also Read : పులివెందుల నుంచి తాడేపల్లికి.. సచివాలయంలో ‘మరకా’ హవా?
పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అత్యంత ఆకర్షణీయమైన రాయితీలను ప్రకటించింది. ఏవీజీసీ-ఎక్స్ఆర్ పార్కు అభివృద్ధికి అయ్యే మూలధన వ్యయంలో 25 శాతం (గరిష్ఠంగా రూ.50 కోట్లు), సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు 25 శాతం (గరిష్ఠంగా రూ.25 కోట్లు), మౌలిక సదుపాయాల కల్పన ఖర్చులో 50 శాతం (గరిష్ఠంగా రూ.2 కోట్లు) రాయితీగా అందించనుంది. రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టి, కనీసం 200 మందికి ఉపాధి కల్పించే ప్రాజెక్టులను మెగా ప్రాజెక్టులుగా పరిగణించి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనుంది.
Also Read : వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం..!
మూలధన రాయితీలతో పాటు కంపెనీల నిర్వహణ ఖర్చుల్లోనూ ప్రభుత్వం అండగా నిలవనుంది. కార్యాలయ అద్దె, విద్యుత్ టారిఫ్, డిజిటల్ కనెక్టివిటీ, క్వాలిటీ సర్టిఫికేషన్ కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు చెల్లించడంతో పాటు ఐదేళ్ల పాటు SGST పూర్తిగా తిరిగి చెల్లించనుంది. స్టాంపు డ్యూటీ మినహాయింపు వంటి వెసులుబాట్లు కల్పించడంతో అమరావతి మీడియా సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపనున్నాయి.


