Monday, November 23, 2026 06:32 PM
Monday, November 23, 2026 06:32 PM

కార్యకర్తే కింగ్.. కర్నూలు ZP ఛైర్మన్‌గా ఉలిగయ్య

తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ..కష్టకాలంలో జెండా మోసిన ప్రతి సైనికుడిని గుండెల్లో పెట్టుకుని చూసుకునే నాయకుడు చంద్రబాబు అని మరోసారి నిరూపితమైంది. ఎన్ని ప్రలోభాలు ఎదురైనా, అక్రమ కేసులు పెట్టి వేధించినా, జైలుకు పంపినా పార్టీ జెండాను వదలని ఓ సామాన్య కార్యకర్తకు అత్యున్నత గౌరవం దక్కింది. కర్నూలు జిల్లా పరిషత్ ఛైర్మన్ పీఠంపై సామాన్య కార్యకర్త చూడి ఉలిగయ్యను కూర్చోబెట్టి, టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కార్యకర్తల పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు.

Also Read : అంతర్గత ప్రజాస్వామ్యం.. బాగా ముదిరినట్లుంది..!

1982లో NTR తెలుగుదేశం పార్టీని స్థాపించిన నాటి నుంచి ఉలిగయ్య పసుపు జెండా నీడలోనే నడుస్తున్నారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పార్టీ మారాలంటూ తీవ్ర ఒత్తిళ్లు, ప్రలోభాలు ఎదురైనా ఆయన తలొగ్గలేదు. దీంతో కక్షగట్టిన ప్రత్యర్థులు ఆయనపై ఏకంగా 32కు పైగా అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారు. ఆయన జైల్లో ఉండగానే, ఆయన భార్య కౌతాళం MPP చాముండేశ్వరిపై అవిశ్వాస తీర్మానం పెట్టి పదవి నుంచి దించేసినా, పొలాలు బీళ్లు పెట్టించి ఆర్థికంగా దెబ్బతీసినా..ఉలిగయ్య మాత్రం ప్రాణం ఉన్నంతవరకు టీడీపీని వీడేదే లేదని మొక్కవోని ధైర్యంతో నిలబడ్డారు.

Also Read : రిలయన్స్ దూకుడు.. ఏడాదిలోనే..!

44 ఏళ్ల పాటు సామాన్య కార్యకర్తగా, మండల కన్వీనర్‌గా, జిల్లా ఉపాధ్యక్షుడిగా నిస్వార్థంగా పార్టీకి సేవలు అందించిన ఉలిగయ్య కష్టానికి ఇప్పుడు తగిన ప్రతిఫలం దక్కింది. తాజా ఎన్నికల్లో కౌతాళం జడ్పీటీసీగా గెలిచిన ఆయనకు, BC జనరల్‌కు రిజర్వ్ అయిన కర్నూలు జడ్పీ ఛైర్మన్ పదవిని చంద్రబాబు స్వయంగా కట్టబెట్టారు. కేవలం సీనియర్లకే కాకుండా, యువతకు కూడా పెద్దపీట వేస్తూ..దేవనకొండ జడ్పీటీసీ, 22 ఏళ్ల MBBS ఫైనల్ ఇయర్ విద్యార్థిని షేక్ సాదికను వైస్ ఛైర్‌పర్సన్‌గా ఎంపిక చేసి చంద్రబాబు సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.

Also Read : ఎక్స్‌ప్లోరర్ పెద్దపులి బోనుకు చిక్కుతుందా..? అసలేం జరుగుతుంది..?

అనుభవానికి పట్టం కడుతూనే, యువతకు అవకాశం ఇవ్వడం ద్వారా టీడీపీలో కష్టపడే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. డబ్బు, పలుకుబడి కంటే పార్టీ పట్ల నిబద్ధత, విధేయతకే తమ పార్టీలో అసలైన విలువ ఉంటుందని ఈ నిర్ణయంతో టీడీపీ మరోసారి నిరూపించిందంటూ పసుపు శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

పులివెందుల చరిత్రలో కొత్త...

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి...

ఎక్స్‌ప్లోరర్ పెద్దపులి బోనుకు...

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కనుమూరు...

అంతర్గత ప్రజాస్వామ్యం.. బాగా...

కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం కారణంగానే నాయకులు...

ఏపీకి మరో రెండు,...

ఇటీవల సంభవించిన 'అర్నబ్', 'మురసు' తుపానుల...

రిలయన్స్ దూకుడు.. ఏడాదిలోనే..!

కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రిలయన్స్ కన్స్యూమర్...

టార్గెట్ 2029.. కపిల్...

"2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా వైఎస్‌ఆర్...

పోల్స్