Monday, November 23, 2026 06:30 PM
Monday, November 23, 2026 06:30 PM

అంతర్గత ప్రజాస్వామ్యం.. బాగా ముదిరినట్లుంది..!

కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం కారణంగానే నాయకులు బహిరంగంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారన్న వాదన బాగా వినిపిస్తోంది. అయితే విమర్శలు వ్యక్తిగత ఆరోపణల స్థాయికి చేరినప్పుడు అవి ప్రభుత్వ ప్రతిష్ఠపై ప్రభావం చూపే అవకాశముంది. తాజాగా అసమ్మతి నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో పరిస్థితి మరింత వేడెక్కింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొదలు పెట్టిన విమర్శల పర్వం ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి చేరింది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆరోపణలు ప్రభుత్వ పనితీరుపై కొత్త ప్రశ్నలను లేవనెత్తాయి. మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు కూడా పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారాయి.

Also Read : ఆంధ్రప్రదేశ్‌పై ఇతర రాష్ట్రాల అసూయ ఎందుకు?

మరోవైపు అసమ్మతి నేతలపై క్రమశిక్షణ చర్యలకు కాంగ్రెస్ సిద్ధమవుతుందన్న సంకేతాలు వెలువడుతున్నా యి. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌లో అసలు ఏం జరుగుతోంది? ఈ విభేదాలు నాయకత్వ పోరుకు దారితీస్తాయా? అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతికి ప్రధాన కేంద్రంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మారారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదంటూ నేరుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిపైనా విమర్శలు చేశారు. కొడంగల్ వంటి నియోజకవర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ మునుగోడును నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. నిధుల కొరతతో పనులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : టాలీవుడ్‌లో మరోసారి పైరసీ కలకలం.. రిలీజైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 4 సినిమాలు..!

నిధుల విషయంలో వివక్ష కొనసాగితే మరో కురుక్షేత్రం తప్పదంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన హెచ్చరిక కాంగ్రెస్‌లో రాజకీయ దుమారం రేపింది. అసమ్మతి ఎమ్మెల్యేల విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారితీశాయి. సిద్దిపేటలో జరిగిన బహిరంగ సభలో విమర్శకులను పిచ్చికుక్కలంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై రాజగోపాల్ రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. ఉన్నత పదవుల్లో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలని, అధికారంలో ఉన్నామనే కారణంతో అహంకార పూరితంగా మాట్లాడకూడదని రేవంత్ పేరు ప్రస్తావించకుండానే వ్యాఖ్యానించారు.

Also Read : పెళ్లి కోసం మందులతో బరువు తగ్గుతున్నారా..?

పార్టీని వదిలిపెట్టకుండా, పార్టీలోనే ఉంటూ ప్రభుత్వ నాయకత్వాన్ని ప్రశ్నించే వైఖరిని రాజగోపాల్ రెడ్డి కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి తెర తీశాయి. ప్రభుత్వ అధికారుల అవినీతి కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని ఆరోపించారు. వారసత్వ ఆస్తి బదిలీకి సంబంధించిన ఒక పని కోసం తాను సూచించినా అధికారులు పట్టించుకోలేదని, అదే వ్యక్తి రూ.15 వేల లంచం ఇచ్చిన తర్వాత పని పూర్తయిందని ఆరోపించారు. అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపునకు 10 నుంచి 20 శాతం వరకు కమీషన్లు డిమాండ్ చేస్తున్నారని కూడా ఆరోపించారు.

కాంగ్రెస్‌లో వివాదాలు కేవలం ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేల మధ్యనే పరిమితం కాలేదు. మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మధ్య ఢిల్లీలో చోటుచేసుకున్న వివాదం కూడా పార్టీ నాయకత్వానికి సమస్యగా మారింది. పార్టీ సంస్థాగత పదవుల నియామకాల విషయంలో మొదలైన విభేదాలు తీవ్రస్థాయికి చేరినట్లు వార్తలు వచ్చాయి. ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చేందుకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రయత్నించినప్పటికీ, గాంధీభవన్ సమావేశానికి ఇద్దరూ హాజరుకాలేదు. ఈ వ్యవహారంపై అధిష్ఠానానికి నివేదిక సిద్ధం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. తాజా పరిణామాలను కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.

రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలను అధిష్ఠానం పరిశీలిస్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. గతంలో కొండా సురేఖ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌లో అందరికీ ఒకే విధమైన నియమాలు వర్తిస్తాయని పేర్కొన్నారు. అయితే అసమ్మతిని క్రమశిక్షణ చర్యలతో అణచివేయాలా? లేక ఎమ్మెల్యేల ఫిర్యాదులను పరిశీలించి సమస్యలను పరిష్కరించాలా? అన్నది నాయకత్వం ముందున్న కీలక ప్రశ్న. తెలంగాణ కాంగ్రెస్ ముందున్న సమస్య ఇప్పుడు కేవలం ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల అసంతృప్తి మాత్రమే కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి అధిష్ఠానం మద్దతు కొనసాగుతున్నప్పటికీ, సొంత పార్టీ నేతల నుంచి వస్తున్న విమర్శలను ఎలా ఎదుర్కొంటారన్నది కీలకంగా మారింది. అసమ్మతి నేతలను పిలిపించి బుజ్జగిస్తారా? వారి ఆరోపణలపై విచారణకు ఆదేశిస్తారా? లేక క్రమశిక్షణ చర్యలతో కట్టడి చేస్తారా? అనేది వేచి చూడాల్సిందే.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

పులివెందుల చరిత్రలో కొత్త...

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి...

కార్యకర్తే కింగ్.. కర్నూలు...

తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ..కష్టకాలంలో...

ఎక్స్‌ప్లోరర్ పెద్దపులి బోనుకు...

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కనుమూరు...

ఏపీకి మరో రెండు,...

ఇటీవల సంభవించిన 'అర్నబ్', 'మురసు' తుపానుల...

రిలయన్స్ దూకుడు.. ఏడాదిలోనే..!

కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రిలయన్స్ కన్స్యూమర్...

టార్గెట్ 2029.. కపిల్...

"2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా వైఎస్‌ఆర్...

పోల్స్