“2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రాజకీయ పావులు కదుపుతుంది. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి.. వైవీ సుబ్బారెడ్డి లను తప్పించి పార్టీ వర్గాలు వైఎస్ భారతీ రెడ్డి చేతికి వెళ్లినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. దీంతో సుబ్బారెడ్డి, సజ్జల ప్రాధాన్యత పార్టీలో రోజు రోజుకి తగ్గుతూ వస్తుందంటున్నారు. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహంలో ప్రధాన భూమిక పోషించిన కపిల్ సాహు వ్యూహంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలలో పూర్తి తప్పనిసరి అనే అంశాన్ని జగన్ తెరపైకి తెచ్చారు. ఈ విషయంలో కొంతమేర ఆ పార్టీ విజయం సాధించినట్లు అయ్యింది.
Also Read : జాతీయ కాంగ్రెస్‌లో భారీ ప్రక్షాళన..!
ఒకప్పుడు పార్టీలో వవర్ సెంటర్‌గా ఉండే నాయకులు ఇప్పుడు కొంతమేర దూరంగా ఉంటున్నారు. పార్టీలో అన్ని తానే అయ్యి వైఎస్ భారతి వైసీపీని నడిపిస్తున్నారు అనే మాట బాగా వినిపిస్తోంది. కపిల్ సాహు ప్రణాళికలో భాగంగానే ఇదంతా నడుస్తుందని అభిప్రాయం ఆ పార్టీ నేతలలో నెలకొంది. తమిళనాడులో నటుడు విజయ్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన కపిల్ సాహు.. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యతను తన భుజస్కందాలపై వేనుకున్నట్లు తెలుస్తుంది. దీనికి అనుగుణంగానే రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ, ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో పోటీ తప్పనిసరి అనే నినాదాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఎక్కడైనా ఏకగ్రీవాలకు సహకరిస్తే ఆ నియోజకవర్గాల ఇన్చార్జులను మార్పు చేయడం తప్పనిసరి అని హెచ్చరికలను జారీ చేశారు. అందుకే వైసీపీ శ్రేణులు ప్రతిచోట అభ్యర్థులను బరిలో నిలిపారు.
రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ గద్దె నెక్కెందుకు ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఆ పార్టీలో పవర్ సెంటర్‌గా ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డిని కొంత మేర బాధ్యతల నుండి పక్కన పెట్టి ఆ బాధ్యతలను నేరుగా వైయస్ భారతీ రెడ్డి భుజస్కందాలపై పెట్టుకున్నారు. దీంతో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో సంచలన చర్చ సాగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గట్టి పోటీనే ఇచ్చారు. ఎక్కడ ఏకగ్రీవాలకు తావు లేకుండా అన్ని నియోజకవర్గాల్లో కూడా పోటీకి సై అన్నారు. పంచాయతీ పోరులో కూడా చాలా చోట్ల నువ్వా నేనా అన్నట్లుగా పోటీ సాగుతోంది.
Also Read : ఏపీకి కేంద్రం మరో వరం..!
మునిసిపర్ మేయర్ స్థానాల్లో ఇప్పటికే ఒకటి వైసీపీ గెలిచింది. తాజాగా జరిగే నాలుగు కార్పొరేషన్లలో ఒకటి ఖాయమనే మాట బాగా వినిపిస్తోంది. అలాగే జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా వైసీపీ ఒకటి సొంతం చేసుకుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని మేయర్ స్థానాలు, జెడ్పీలను వైసీపీ అభ్యర్థులే గెలిచారు. కానీ ఇప్పుడు అలా వార్ వన్ సైడ్ కాలేదు. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో కొంతమేర విజయాన్ని సొంతం చేసుకున్న వైసీపీ.. అదే ఊపుతో పల్లె పోరులో కూటమి ప్రభుత్వంతో తలపడుతుంది.
2029 ఎన్నికల్లో వైసీపీ గెలుపే లక్ష్యం అనే బాధ్యతలు చేపట్టిన కపిల్ సాహు.. ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని విప్లవాతమైన మార్పులు తీసుకువచ్చి కొంతమంది సీనియర్ నాయకులను తొలగించి పూర్తిగా ఆ బాధ్యతలను వైఎస్ భారతి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నుండి పంచాయతీ ఎన్నికల వరకు అధికార పక్షానికి సహకరించిన నాయకులను తొలగిస్తామని ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనలు నియోజకవర్గ ఇన్చార్జ్లలో దడ పుట్టించాయి. ఎక్కడైనా కొంతమంది స్థానిక నాయకులు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలతో మాట్లాడి గ్రామాలలో రాజకీయంగా సహకరించాలని కోరుతున్న దానికి ససమిరా అంటున్నారు. దీంతో అన్నిచోట్ల పోటీ అనివార్యంగా మారింది. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమేర విజయం సాధించినట్లుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.


