Saturday, November 21, 2026 03:05 PM
Saturday, November 21, 2026 03:05 PM

ఏపీకి కేంద్రం మరో వరం..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై కేంద్రం వరాల జల్లు కురిపిస్తోంది. ఇప్పటికే పలు కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం కీలక మార్గాల్లో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, కొత్త రైళ్ల ప్రకటనలు చేస్తుంది. రైల్వే ప్రాజెక్టుల కేటాయింపులో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం పెద్ద పీట వేస్తోంది. రైల్వే వ్యవస్థలో అత్యంత ప్రజాదరణ పొందిన సెమీ హైస్పీడ్ రైళ్లు వందేభారత్ రైళ్ల కేటాయింపులో కేంద్రం తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తుంది. అటు హైదరాబాద్ నుంచి, ఇటు విశాఖ నుంచి పది వరకు వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. తాజాగా మరో మార్గంలో వందేభారత్ రైలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Also Read : ఆంధ్రప్రదేశ్‌పై ఇతర రాష్ట్రాల అసూయ ఎందుకు?

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరాలపై రైల్వే శాఖ కీలక దృష్టి పెట్టింది. అంతకు ముందు ఈస్ట్ కోస్ట్ లేదా దక్షిణ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే అధికారుల దయా దాక్షిణ్యాల మీదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైళ్లు పరుగులు పెట్టాయి. కానీ ఇప్పుడు మాత్రం.. దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటు తర్వాత.. పాత విధానానికి స్వస్తి పలికారు. ఇప్పటికే విశాఖ, నరసాపురం, కాకినాడ, తిరుపతి వంటి ప్రధాన నగరాల నుంచి ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. తాజాగా విశాఖ – తిరుపతి మధ్య వందేభారత్ రైలు నడిపేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

విశాఖ కేంద్రంగా ఇప్పటికే నాలుగు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. వీటిల్లో రెండు సికింద్రాబాద్, ఒకటి ఒడిశాలోని భువనేశ్వర్‌కు, మరొకటి చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ మధ్య నడుస్తున్నాయి. ఈ నాలుగు రైళ్లతో పాటు ఇప్పుడు మరో వందేభారత్ కూడా విశాఖ వాసులకు అందుబాటులోకి వచ్చింది. విశాఖ – తిరుపతి మధ్య కొత్త వందేభారత్ రైలు నడిపేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతిరోజు ఉదయం 5.30 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి.. మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరిగి 3 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి.. రాత్రి 11 గంటలకు విశాఖ చేరుకునేలా షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు.

Also Read : స్టాక్ మార్కెట్లోకి APMDC.. చంద్రబాబు మెగా ప్లాన్!

ప్రస్తుతం విశాఖ – తిరుపతి మధ్య ప్రయాణం సుమారు 12 గంటలు. కానీ వందేభారత్ వల్ల ప్రయాణ సమయం 8.30 గంటలకే గమ్యం చేరుకోవచ్చు. విశాఖ – తిరుపతి మధ్య సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరులో మాత్రమే ఈ రైలుకు స్టాపింగ్ ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ రైలు ప్రకటిస్తే.. విశాఖ – తిరుపతి మార్గంలో ప్రయాణీకులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందంటున్నారు రైల్వే అధికారులు. త్వరలోనే ఈ రైలు గురించి అధికారిక ప్రకటన వస్తుందని తెలిపారు. అలాగే విశాఖ – బెంగళూరు మధ్య వందేభారత్ స్లీపర్ రైలు కూడా పరుగులు పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

నాడు వైఎస్సార్ ఆహ్వానిస్తే...

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...

ఓటమిని జీర్ణించుకోలేక బొత్స...

విజయనగరం జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి...

స్టాక్ మార్కెట్లోకి APMDC.....

ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ సరికొత్త చరిత్ర...

చంద్రబాబు, లోకేష్‌తో భేటీ...

కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పీఠం...

ఒకే ఇంట్లో ఎమ్మెల్యే.....

ఆంధ్రప్రదేశ్ జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికలు...

ఆంధ్రప్రదేశ్‌పై ఇతర రాష్ట్రాల...

IndiaStat, Projects Today గణాంకాల ప్రకారం,...

పోల్స్