టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు దంపతుల జీవితంలో సరికొత్త ఆనందం వెల్లివిరిసింది. సమంత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. గురువారం తమకు మొదటి సంతానంగా కుమారుడు జన్మించినట్లు సమంత శుక్రవారం తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. చిన్నారి చిట్టి చేతిని సమంత, రాజ్ తమ చేతులతో పట్టుకుని ఉన్న ఒక అందమైన ఫోటోను షేర్ చేస్తూ ఈ శుభవార్తను ప్రకటించారు.
Also Read : జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సరికొత్త వ్యూహం..!
అంతేకాకుండా, తమ ముద్దుల తనయుడికి దేవ్ నిడిమోరు అని నామకరణం చేసినట్లు సమంత వెల్లడించారు. “మా అందమైన మగబిడ్డ దేవ్ నిడిమోరు. మా హృదయాలు ఎన్నడూ లేనంత సంతోషంతో నిండిపోయాయి” అంటూ సమంత, రాజ్ తమ ఆనందాన్ని భావోద్వేగంగా వ్యక్తం చేశారు. గతేడాది డిసెంబర్లో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట, ఈ ఏడాది జూన్‌లో తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read : సర్పంచ్ పదవులకు బేరాలు..?
సమంత తల్లయినట్లు ప్రకటించిన కొద్దిసేపటికే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు లక్షలాది మంది అభిమానులు, నెటిజన్లు సమంత-రాజ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను దాటుకుని మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తున్న సమంతకు, చిన్నారి దేవ్‌కు ఆయురారోగ్యాలు కలగాలని అభిమానులు ఆకాంక్షిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


