Friday, November 20, 2026 05:05 PM
Friday, November 20, 2026 05:05 PM

పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అరెస్ట్..!

వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. శాంతిభద్రతల పరిరక్షణ, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో పాటు వైసీపీ నేత దుష్యంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రెండో దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు పేరుతో 144 సెక్షన్ అమలులో ఉన్న ప్రాంతాల్లో భారీ సంఖ్యలో వాహనాలు, కార్యకర్తలతో కలిసి అవినాష్‌రెడ్డి హల్‌చల్ చేయడమే కాకుండా, పోలీస్ స్టేషన్ వద్దకు భారీ అనుచరగణంతో రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Also Read : తల్లయిన సమంత.. ముద్దుల కుమారుడి పేరు ఇదే..!

అంతకుముందు సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరు వద్ద ఎంపీ అవినాష్‌రెడ్డి కాన్వాయ్‌, టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి వర్గీయుల వాహనాలు ఎదురుపడటంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ క్రమంలో వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార కూటమి నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ అవినాష్‌రెడ్డి డీఎస్పీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సుమారు 70 వాహనాల్లో చక్రాయపేట వైపు వెళ్లేందుకు ప్రయత్నించడం, నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీలు నిర్వహించడంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని భావించిన పోలీసులు,

Also Read : సర్పంచ్ పదవులకు బేరాలు..?

డీఎస్పీ మురళి నాయక్ ఆధ్వర్యంలో అవినాష్‌రెడ్డిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్ సమాచారంతో పులివెందుల పట్టణంలో ఒక్కసారిగా రాజకీయ వేడెక్కింది. వైసీపీ శ్రేణులు పెద్దఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా పెట్టారు. పంచాయతీ ఎన్నికల వేళ పులివెందులలో ఇరు పార్టీల మధ్య నెలకొన్న ఈ పోరు, అవినాష్ అరెస్ట్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

పేదింటి దళిత బిడ్డకు...

ఎన్టీఆర్ జిల్లా తొలి జిల్లా పరిషత్...

కాలుష్యానికి కారకులెవరు..?

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చాలా...

బ్రేకింగ్: ఎమ్మెల్యే పదవికి...

వైఎస్సార్ కడప జిల్లా పరిషత్ ఛైర్మన్...

తల్లయిన సమంత.. ముద్దుల...

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్...

జాతీయ స్థాయిలో కాంగ్రెస్...

వచ్చే 2029 లోక్‌సభ ఎన్నికలే ప్రధాన...

సర్పంచ్ పదవులకు బేరాలు..?

సర్పంచ్ పదవులకు ఎమ్మెల్యే లే బేరసారాలు...

పోల్స్