Friday, November 20, 2026 05:00 PM
Friday, November 20, 2026 05:00 PM

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సరికొత్త వ్యూహం..!

వచ్చే 2029 లోక్‌సభ ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కీలక విభాగాల బలోపేతం కోసం ఏఐసీసీ ఏకంగా 81 మంది కొత్త జాతీయ కార్యదర్శులను నియమించింది. వీరిలో 43 మంది పూర్తిగా కొత్త ముఖాలకు అవకాశం కల్పించగా, గతంలో బాధ్యతలు నిర్వర్తించిన 25 మందిని తప్పించడం ద్వారా పార్టీ యంత్రాంగంలో కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేసింది. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకును పటిష్టం చేసుకునేలా, రాహుల్ గాంధీ ప్రతిపాదిస్తున్న సామాజిక న్యాయం నినాదాన్ని ఈ నియామకాల్లో స్పష్టంగా అమలు చేశారు.

Also Read : కాకినాడ పరిణామం.. సిక్కోలుకు సంకేతమా..?

కొత్తగా నియమితులైన 81 మంది కార్యదర్శులలో సగం మంది అంటే 50 శాతం మంది ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచే ఎంపికయ్యారు. ఇందులో 20 మంది ఓబీసీ, ఐదుగురు ఈబీసీ, 11 మంది ఎస్సీ, ఐదుగురు ఎస్టీ వర్గాలతో పాటు 11 మంది మైనారిటీలకు చోటు కల్పించారు. మొత్తంగా దాదాపు మూడింట రెండు వంతుల పదవులను బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలకు కేటాయించడం గమనార్హం. దీనితో పాటు వచ్చే ఎన్నికల నాటికి యువతను, మహిళలను పార్టీ వైపు ఆకర్షించే వ్యూహంలో భాగంగా కీలక మార్పులు చేశారు.

Also Read : 35 ఏళ్ల తర్వాత కశ్మీర్‌లో సంచలనం.. అమిత్ షా కీలక ప్రకటన..!

కొత్తగా నియమితులైన జాతీయ కార్యదర్శుల్లో 12 మంది మహిళలకు స్థానం కల్పించగా, మొత్తం బృందం సగటు వయసు 49 ఏళ్లుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని గెలిపించే బాధ్యతను ఈ కొత్త కార్యదర్శుల భుజాలపై పెడుతూనే, కీలక విభాగాల్లో అనుభవజ్ఞులకు ప్రాధాన్యత ఇచ్చారు. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎస్.ఎ. సంపత్ కుమార్, పి. గోపి, ఉషా నాయుడు సహా 25 మంది నేతలను బాధ్యతల నుంచి తప్పించారు. రాబోయే మూడేళ్లలో క్షేత్రస్థాయిలో మెరుగైన ఫలితాలు చూపిన కార్యదర్శులకు రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌లుగా పదోన్నతి కల్పించడం ద్వారా 2029 ఎన్నికలకు పార్టీని పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని అధిష్ఠానం భావిస్తోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

పేదింటి దళిత బిడ్డకు...

ఎన్టీఆర్ జిల్లా తొలి జిల్లా పరిషత్...

కాలుష్యానికి కారకులెవరు..?

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చాలా...

పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.....

వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో...

బ్రేకింగ్: ఎమ్మెల్యే పదవికి...

వైఎస్సార్ కడప జిల్లా పరిషత్ ఛైర్మన్...

తల్లయిన సమంత.. ముద్దుల...

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్...

సర్పంచ్ పదవులకు బేరాలు..?

సర్పంచ్ పదవులకు ఎమ్మెల్యే లే బేరసారాలు...

పోల్స్