సర్పంచ్ పదవులకు ఎమ్మెల్యే లే బేరసారాలు పెట్టారా..? ఎమ్మెల్యేల ద్వారా సర్పంచ్ పదవులను కొనుక్కోవాలనుకుంటున్నారా..? అంటే అవుననే మాటే వినిపిస్తోంది. అసలు గ్రామ సర్పంచ్ పదవులకు కొందరు ఎమ్మెల్యేలే రేటు కట్టడం ఏమిటనే ప్రశ్న అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అదే సమయంలో సర్పంచ్ పదవులను లక్షలు, కోట్లు ఇచ్చి మరీ ఎందుకు కొనుక్కుంటున్నారనేది మరో పెద్ద అనుమానం. అయితే.. ఈ సాంప్రదాయం ఇప్పుడు కొత్తగా వచ్చిందా..?. గతంలో కూడా ఇలాంటి బేరసారాలు జరిగాయా..?
Also Read : భారతీయ రైల్వే.. బాబోయ్.. ఇదేం దోపిడి..?
నిజానికి గతంలో సర్పంచ్ పదవి వల్ల ఆస్తులు అమ్ముకున్న వారున్నారు. అదే సమయంలో ఆస్తులు సంపాదించుకున్న వారు కూడా వున్నారు. తాజాగా కొందరు వ్యక్తులు, సర్పంచ్ పదవులను సొమ్ములతో కొనుక్కునేందుకు లక్షలు, కోట్లు ఎర చూపుతున్నారు. మరికొందరేమో స్వయంగా ముందుకొచ్చి తమను ఏకగ్రీవంగా పంచాయతీ సర్పంచ్ పధవికి ఎన్నుకుంటే.. లక్షలు, కోట్లు ఇస్తామంటున్నారు కూడా. ఇప్పటికే చాలా గ్రామాల్లో సర్పంచ్ పదవి కోసం వేలంపాటలు నిర్వహిస్తున్నారు. కావలి సమీపంలో ఓ గ్రామంలో ఏకంగా రెండున్నర కోట్ల రూపాయలకు సర్పంచ్ పదవి సొంతం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి కూడా.
ఒక వైపు పంచాయతీ సర్పంచ్ పదవితో పాటు, వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైతే, పంచాయతీలకు ప్రభుత్వమే లక్షల రూపాయల నజరానాలు ప్రకటించింది. గతంలో వున్న నజరానాల కన్నా, ఇప్పుడు భారిగా పెంచింది. తాజాగా సర్పంచ్ పదవులు పొందేందుకు కొందరు ఎమ్మెల్యేలను ఆశ్రయించి సర్పంచ్ పదవికి తమను ఏకగ్రీవంగా ఎన్నికయ్యేటట్లు చేస్తే లక్షలు, కోట్లు ఇస్తామంటు ఆఫర్లు కూడా ఇస్తున్నారు. పంచాయతీ ఆదాయాలను బట్టి కొందరు ఎమ్మెల్యేలే సర్పంచ్ పదవికి రేట్లు నిర్ణయిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. మేజర్ పంచాయితీకి 70 లక్షల నుండి కోటి రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారనే మాట బాగా వినిపిస్తోంది. అంతే కాదు ఇంకా ఎక్కువ రేటు పలికితే వారినే సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తామని హామీ కూడా ఇస్తున్నారట. మీడియం పంచాయతీకి 50 లక్షలు, సాధారణ, చిన్న పంచాయతీలకు అయితే 15 నుండి 20 లక్షల రూపాయలు అడుగుతున్నారటా..!.
Also Read : విప్ ధిక్కరించి మరీ.. ఎంపీపీ ఎన్నిక వెనుక కుట్ర..!
కొన్ని చోట్ల అయితే.. పార్టీలో కీలకంగా వ్యవహరించి.. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడిన వారిని కాదని.. చివరి నిమిషంలో డబ్బులు ఇచ్చిన వారికే టికెట్ ఇస్తున్నారు కూడా. నామినేషన్ ముందు రోజు వరకు నీకే టికెట్ అని చెప్పిన నేతలు.. సరిగ్గా నామినేషన్ రోజు మాత్రం.. ఈసారికి వాళ్లు అడుగుతున్నారు.. నీకు వేరే పదవి ఇస్తాం.. అని బుజ్జగిస్తున్నారు. దీంతో.. పదవి కోసం గంపెడాశలు పెట్టుకున్న ద్వితీయశ్రేణి నేతలంతా.. చివరి నిమిషంలో అవకాశం దక్కకపోవడంతో.. చేసేది లేక.. సైలెంట్‌గా ఉంటున్నారు. దీంతో.. పార్టీ అభ్యర్థి గెలుపు కష్టమనే మాట బాగా వినిపిస్తోంది కూడా. ఇప్పటికైనా పార్టీ పెద్దలు రంగంలోకి దిగి.. కష్టపడిన వారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.


