Saturday, November 21, 2026 11:44 AM
Saturday, November 21, 2026 11:44 AM

ఒకే ఇంట్లో ఎమ్మెల్యే.. జెడ్పీ ఛైర్‌పర్సన్.. ఏపీలో నాలుగు కుటుంబాల అరుదైన రికార్డు..!

ఆంధ్రప్రదేశ్ జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన సన్నివేశానికి వేదికయ్యాయి. ఒకే కుటుంబంలో ఒకరు శాసనసభ్యుడిగా, మరొకరు జిల్లా ప్రజా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా అత్యున్నత పదవులను అధిరోహించడం ద్వారా రాష్ట్రంలోని నాలుగు ప్రముఖ రాజకీయ కుటుంబాలు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె చింతమనేని సాయి నవ్యశ్రీ ఏలూరు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై పదవీ బాధ్యతలు చేపట్టారు.

Also Read : ఆంధ్రప్రదేశ్‌పై ఇతర రాష్ట్రాల అసూయ ఎందుకు?

పెదవేగి జెడ్పీటీసీగా తొలిసారి రాజకీయ అరంగేట్రం చేసిన నవ్యశ్రీ ఏకగ్రీవంగా గెలుపొందడమే కాకుండా, ఇప్పుడు ఏలూరు జెడ్పీ పీఠాన్ని అధిరోహించి తండ్రికి తగ్గ తనయగా నిలిచారు. అనంతపురం జిల్లా రాజకీయాల్లో తిరుగులేని ముద్ర వేసిన పరిటాల కుటుంబంలోనూ ఇదే తరహా అరుదైన కలయిక కనిపిస్తోంది. రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యేగా పరిటాల సునీత కొనసాగుతుండగా, ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ నూతనంగా ఏర్పడిన శ్రీ సత్యసాయి జిల్లా ప్రజా పరిషత్ ప్రథమ ఛైర్మన్‌గా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు. దివంగత పరిటాల రవి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా ఒకే ఇంట్లో తల్లి ఎమ్మెల్యేగా, కుమారుడు జెడ్పీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

Also Read : కొత్త హోండా అవన్సియర్ ఎస్‌యూవీ రిలీజ్.. ప్రత్యేకతలు ఇవే..!

ఇక రాయలసీమ, ప్రకాశం జిల్లాల పరిధిలోనూ మరో రెండు ఎమ్మెల్యేల కుటుంబాలకు జెడ్పీ ఛైర్మన్ పదవులు దక్కాయి. కడప జిల్లా కమలాపురం టీడీపీ ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి తండ్రి, సీనియర్ నేత పుత్తా నరసింహారెడ్డి కడప జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అలాగే ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సోదరుడు కందుల రామిరెడ్డి నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఒకే ఇంట్లో శాసనసభ, జిల్లా పరిషత్ వంటి రెండు కీలక రాజ్యాంగబద్ధ పదవులు కొలువుదీరడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

చంద్రబాబు, లోకేష్‌తో భేటీ...

కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పీఠం...

ఆంధ్రప్రదేశ్‌పై ఇతర రాష్ట్రాల...

IndiaStat, Projects Today గణాంకాల ప్రకారం,...

పేదింటి దళిత బిడ్డకు...

ఎన్టీఆర్ జిల్లా తొలి జిల్లా పరిషత్...

కాలుష్యానికి కారకులెవరు..?

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చాలా...

పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.....

వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో...

బ్రేకింగ్: ఎమ్మెల్యే పదవికి...

వైఎస్సార్ కడప జిల్లా పరిషత్ ఛైర్మన్...

పోల్స్