Saturday, November 21, 2026 06:32 AM
Saturday, November 21, 2026 06:32 AM

ఈరోజు రాశి ఫలితాలు (21-11-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తిక మాసం, శుక్ల పక్షం.. 21-11-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

సోదరులతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలుంటాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగమున ఊహించని మార్పులు ఉంటాయి.
————————–

వృషభం

ధన వ్యవహారాలు కలసివస్తాయి. సన్నిహితులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.
————————–

మిధునం

అవసరానికి చేతికి ధనం అందుతుంది. మిత్రుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. దూరప్రాంతాల బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహమున, వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
————————–

కర్కాటకం

ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత గందరగోళ పరిస్థితులుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూరపు బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. సంతాన ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.
————————–

సింహం

ఉద్యోగులు చేయని పనికి నిందలు పడతారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటా బయట సమస్యలు మరింత పెరుగుతాయి. ఆరోగ్యం సహకరించక ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి.
————————–

కన్య

నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. నూతన కార్యక్రమాలను చేపట్టి లాభాలు అందుకుంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.
————————–

తుల

ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు అంతగా కలిసి రావు. స్ధిరాస్తి సంబంధిత వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.
————————–

వృశ్చికం

కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. సమాజంలో ప్రముఖుల పరిచయాలు కొంత ఉత్సాహం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని వైపుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.
————————–

ధనస్సు

వ్యాపార ఉద్యోగాలు సమస్యాత్మకంగా మారుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. కుటుంబ బాధ్యతలు పెరిగి ఒత్తిడి అధికమవుతుంది. అనుకున్న సమయానికి ధన సహాయం అందక ఇబ్బంది పడతారు. బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది.
————————–

మకరం

కుటుంబ సభ్యులతో చర్చలు లాభసాటిగా సాగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. దీర్ఘకాలిక ఋణ సమస్యల నుండి బయట పడతారు. స్థిరాస్తి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది.
————————–

కుంభం

నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆర్థిక పరంగా ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు.
————————–

మీనం

ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాల వలన శ్రమాదిక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.
————————–

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహన కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఆంధ్రప్రదేశ్‌పై ఇతర రాష్ట్రాల...

IndiaStat, Projects Today గణాంకాల ప్రకారం,...

పేదింటి దళిత బిడ్డకు...

ఎన్టీఆర్ జిల్లా తొలి జిల్లా పరిషత్...

కాలుష్యానికి కారకులెవరు..?

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చాలా...

పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.....

వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో...

బ్రేకింగ్: ఎమ్మెల్యే పదవికి...

వైఎస్సార్ కడప జిల్లా పరిషత్ ఛైర్మన్...

తల్లయిన సమంత.. ముద్దుల...

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్...

పోల్స్