అంతర్జాతీయ రక్షణ రంగంలో అమెరికా అత్యంత కీలక నిర్ణయాన్ని తీసుకుంది. బ్రిటన్‌లోని రాయల్ ఎయిర్ ఫోర్స్ ఫెయిర్‌ఫోర్డ్ వైమానిక స్థావరం నుండి తన వ్యూహాత్మక యుద్ధ విమానాలైన B-1 లాన్సర్, B-52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్లను అమెరికా అత్యవసరంగా వెనక్కి రప్పించింది. భద్రతా పరమైన ముప్పులు, ఉగ్రవాద దాడుల కుట్రల నేపథ్యంలోనే ఈ అత్యాధునిక బాంబర్లను అమెరికాలోని స్వంత స్థావరాలకు తరలించినట్లు పెంటగాన్ అధికారికంగా ధృవీకరించింది.
Also Read : అలెర్ట్.. ప్రపంచానికి పొంచి ఉన్న భారీ ముప్పు..!
అందిన సమాచారం ప్రకారం.. గత వారం రోజులుగా ఆర్‌ఏఎఫ్ ఫెయిర్‌ఫోర్డ్ వైమానిక స్థావరం సమీపంలో అనుమానాస్పద కదలికలు కలకలం రేపాయి. ఉగ్రవాద దాడులకు వ్యూహం పన్నుతున్నారనే ఆరోపణలపై బ్రిటిష్ కౌంటర్ టెర్రరిజం పోలీసులు ఒక బ్రిటీష్-ఇరానియన్ జాతీయుడితో సహా ఆరుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు. ఈ భద్రతా ఉల్లంఘన వెనుక ఇరాన్, దాని అనుబంధ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ హస్తం ఉండవచ్చని బ్రిటన్, అమెరికా రక్షణ నిపుణులు అనుమానిస్తున్నారు.
Also Read : అన్నదమ్ములకు అసలైన పరీక్ష..!
ఈ స్థావరంపై పెద్ద ఎత్తున దాడి చేసి నష్టం కలిగించే స్కెచ్ వేసినట్లు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు రావడంతోనే అమెరికా ఈ అత్యవసర ఉపసంహరణ చర్య చేపట్టింది. లండన్‌కు వాయువ్యంగా ఉన్న ఈ RAF ఫెయిర్‌ఫోర్డ్ వైమానిక స్థావరం అమెరికాకు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇరాన్ భూభాగంలోని కీలక క్షిపణి స్థావరాలపై దాడులు చేయడానికి, అలాగే హర్మూజ్ జలసంధిలో నౌకలపై దాడులను అడ్డుకోవడానికి అమెరికా ఈ B-1 మరియు B-52 బాంబర్లనే ఉపయోగించింది. ఇక్కడి నుంచే పదే పదే ఇరాన్ లక్ష్యాలపై బాంబుల వర్షం కురిపించారు. అందుకే ఇరాన్ ఈ స్థావరాన్ని టార్గెట్ చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.


