Saturday, October 10, 2026 08:44 AM
Saturday, October 10, 2026 08:44 AM

ల్యాండ్ రోవర్ డిఫెండర్ లుక్‌తో JSW కాంబట్..!

ప్రముఖ వ్యాపార దిగ్గజం JSW గ్రూప్.. JSW మోటార్స్ పేరుతో భారత ప్యాసింజర్ వాహన రంగంలోకి అధికారికంగా అడుగుపెట్టబోతోంది. ఈ బ్రాండ్ నుంచి వస్తున్న మొట్టమొదటి మోడల్ JSW కాంబట్ ఎస్‌యూవీని డిసెంబర్ 3న భారత్ లో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న జెటూర్ టీ2 మోడల్ ఆధారంగా ఈ సరికొత్త ఎస్‌యూవీని డిజైన్ చేశారు. దీనిని మన దేశంలోని తయారీ ప్లాంట్‌లోనే అసెంబుల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read : హెచ్-1బీ ఉద్యోగుల గ్రీన్ కార్డ్ కలలకు బ్రేక్..?

బాక్సీ డిజైన్ మరియు ప్రీమియం లుక్‌తో రాబోతున్న ఈ కారు, మార్కెట్లో ఒక సరికొత్త లైఫ్‌స్టైల్ ఎస్‌యూవీగా నిలవనుంది. JSW కాంబట్ ఎస్‌యూవీ లుక్ విషయానికి వస్తే, ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును పోలి ఉంటుంది. వెడల్పైన ఫ్లాట్ బోనెట్, రెక్టాంగ్యులర్ హెడ్‌ల్యాంప్స్, వెనుక వైపు బాక్సీ స్పేర్-వీల్ కవర్ మరియు వెర్టికల్ టెయిల్ ల్యాంప్స్ ఈ కారుకు రగ్గడ్ అండ్ రోడ్ ప్రెజెన్స్ ఇస్తున్నాయి. గ్లోబల్ మోడల్ ప్రకారం దీని కొలతలు 4,785 మిమీ పొడవు, 2,006 మిమీ వెడల్పు, 1,870 మిమీ ఎత్తుతో పాటు 2,800 మిమీ వీల్‌బేస్ కలిగి ఉండే అవకాశం ఉంది.

Also Read : హౌతీల ఎఫెక్ట్.. భారత్‌లో పెట్రోల్ మంటలు తప్పవా..?

ఇది చూడటానికి మహీంద్రా థార్ రాక్స్‌ కన్నా పెద్దదిగా, వెడల్పుగా కనిపిస్తుంది. లోపల 15.6 అంగుళాల భారీ టచ్ స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, 540-డిగ్రీల కెమెరా మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉండే ఛాన్స్ ఉంది. ఈ కారులోని అత్యంత కీలకమైన అంశం దీని పవర్‌ట్రెయిన్. JSW కాంబట్ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, 18.4 కిలోవాట్ అవర్ బ్యాటరీతో కూడిన ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టమ్‌తో రాబోతోంది. ఈ సిస్టమ్ మొత్తంగా 360 హార్స్ పవర్, 610 న్యూటన్ మీటర్ల గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. కేవలం బ్యాటరీ పవర్‌తోనే ఈ కారు దాదాపు 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఫుల్ ట్యాంక్, ఫుల్ చార్జింగ్‌తో ఈ ఎస్‌యూవీ టోటల్ డ్రైవింగ్ రేంజ్ ఏకంగా 1,200 కిలోమీటర్లుగా ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ఫాస్ట్ చార్జర్ సహాయంతో కేవలం 27 నిమిషాల్లోనే దీని బ్యాటరీని 30 నుండి 80 శాతానికి చార్జ్ చేసుకోవచ్చు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

గెలుపు కాదు.. ఓట్లు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్టీల సందడి...

మందులకు లొంగని మలేరియాకు...

వైద్య రంగంలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ...

బ్రేకింగ్: రేపు ఏపీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల...

ఏపీలో స్థానిక ఎన్నికలకు...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు...

తాడేపల్లి ప్యాలెస్‌కు సజ్జల...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల్లో...

హౌతీల ఎఫెక్ట్.. భారత్‌లో...

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి....

పోల్స్