Friday, October 9, 2026 01:04 PM
Friday, October 9, 2026 01:04 PM

హౌతీల ఎఫెక్ట్.. భారత్‌లో పెట్రోల్ మంటలు తప్పవా..?

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి. సౌదీ అరేబియా రాజధాని రియాద్ లక్ష్యంగా యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు భీకర దాడులకు తెగబడ్డారు. రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీలు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డారు. ఈ దాడి కారణంగా ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించడంతో పాటు పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయి. విమానాశ్రయంలో నిలిపి ఉంచిన ఒక వాణిజ్య విమానం కూడా ప్రమాదానికి గురై నిప్పుంటుకున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

Also Read : హెచ్-1బీ ఉద్యోగుల గ్రీన్ కార్డ్ కలలకు బ్రేక్..?

ఈ భీకర దాడులను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ ఊహించని దాడుల నేపథ్యంలో రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసి విమాన సర్వీసులను నిలిపివేశారు. భద్రతా కారణాల దృష్ట్యా సౌదీ వైపు వెళ్లే వైమానిక మార్గాన్ని ప్రమాదకర జోన్‌గా ప్రకటించడంతో అంతర్జాతీయ విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఇందులో భాగంగానే భారత్ కు చెందిన ప్రముఖ ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఆకాశ ఎయిర్ తమ రియాద్ సర్వీసులను అక్టోబర్ 10 వరకు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి.

Also Read : టీడీపీకి తలనొప్పిగా అనంతపురం ఎమ్మెల్యే..!

ఇండిగో కూడా తన విమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది. దిల్లీ నుండి రియాద్ బయలుదేరిన ఒక ఎయిర్ ఇండియా విమానం మధ్యలోనే వెనుదిరిగి తిరిగి దిల్లీ చేరుకుందంటే అక్కడి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై తీవ్రంగా పడింది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు అయిన సౌదీ అరేబియాలో ఈ రకమైన ఘర్షణలు చోటుచేసుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. భారత్ తన దేశీయ అవసరాల కోసం దాదాపు 83 శాతానికి పైగా ముడి చమురును విదేశాల నుంచే, ముఖ్యంగా సౌదీ, ఇరాక్ వంటి దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే, అది భారత్ కు షాక్ తప్పదు. రానున్న రోజుల్లో భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

తాడేపల్లి ప్యాలెస్‌కు సజ్జల...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల్లో...

టీడీపీకి తలనొప్పిగా అనంతపురం...

అధికారంలో ఉన్న టీడీపీకి.. అనంతపురం అర్బన్...

ఇది జగన్ వ్యూహమా?...

స్థానిక సంస్థల ఎన్నికల్లో YSRCP వ్యవహరిస్తున్నతీరు...

స్థానిక సంస్థల ఎన్నికల...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల...

టీటీడీ పై విజయసాయిరెడ్డి...

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పునర్వ్యవస్థీకరణ,...

గాల్లోనే విమానంపై పడ్డ...

ఆకాశంలో ప్రయాణిస్తున్న ఒక విమానంలో ప్రయాణికులకు...

పోల్స్