Friday, October 9, 2026 10:33 AM
Friday, October 9, 2026 10:33 AM

టీడీపీకి తలనొప్పిగా అనంతపురం ఎమ్మెల్యే..!

అధికారంలో ఉన్న టీడీపీకి.. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చుట్టూ ముసురుతున్న వరుస వివాదాలు పెద్ద తలనొప్పిగా మారాయి. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రతిష్ఠను పెంచాల్సిన ప్రజాప్రతినిధి, ఇలా నిరంతరం వివాదాస్పద ఆరోపణల్లో చిక్కుకోవడం అటు స్థానిక క్యాడర్‌ను, ఇటు రాష్ట్ర అధిష్టానాన్ని తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. తాజాగా కర్నూలుకు చెందిన దివ్యభారతి అనే మహిళ, భైరవనగర్‌లోని తన 10 సెంట్ల భూమికి సంబంధించి రూ. 70 లక్షల ఒప్పందంలో మిగిలిన డబ్బు ఇవ్వకుండా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు తనే వేధిస్తున్నారని, రిజిస్ట్రేషన్ చేయకుంటే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టిస్తామని బెదిరించారంటూ ఆధారాలతో ఏకంగా ఎస్పీకి ఫిర్యాదు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

Also Read : ఇది జగన్ వ్యూహమా? రాజకీయ గందరగోళమా?

ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఇలా వివాదాల్లో నిలవడం ఇదే మొదటిసారి కాదు, గతంలోనూ ఆయనకు సంబంధించిన పలు వ్యవహారాలు పార్టీని తీవ్రంగా డిఫెన్స్‌లో పడేశాయి. గతంలో ఒక సబ్ రిజిస్ట్రార్‌ను నెలకు రూ. 1.50 లక్షల మామూళ్లు ఇవ్వాలని బెదిరించినట్లు ఒక ఆడియో లీక్ కావడం, ఎగ్జిబిషన్ నిర్వాహకుల నుంచి రూ. 10 లక్షలు డిమాండ్ చేసి గొడవకు దిగడంతో ఆయన గన్‌మెన్‌పై సస్పెన్షన్ వేటు పడడం వంటి ఘటనలు జిల్లాలో సంచలనం సృష్టించాయి. ఇవే కాకుండా, ఒక ఆడియో క్లిప్‌లో హీరో జూనియర్ ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి అభిమానుల ఆగ్రహానికి గురికావడం, ఆఫీసర్స్ క్లబ్‌లో పేకాట క్లబ్బులను తెరిపిస్తానంటూ బహిరంగంగా వ్యాఖ్యానించడం వంటి ఉదంతాలు పార్టీకి తీవ్ర ఇబ్బందికరంగా మారాయి.

Also Read : టీటీడీ పై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

అయితే తనపై వస్తున్న ఈ ఆరోపణలన్నింటినీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజా భూ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, సదరు మహిళ ఎవరో కూడా తనకు తెలియదని ఆయన స్పష్టం చేశారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక కొందరు కావాలనే కుట్ర పూరితంగా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన వాదిస్తున్నారు. అయినప్పటికీ, ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అవినీతి రహిత, పారదర్శక పాలన అందించాలని చూస్తుంటే.. మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యే ఇలా వరుసగా ఆరోపణలు ఎదుర్కోవడం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతోందని, దీనిపై అధిష్టానం సీరియస్‌గా దృష్టి సారించిందని సమాచారం.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఇది జగన్ వ్యూహమా?...

స్థానిక సంస్థల ఎన్నికల్లో YSRCP వ్యవహరిస్తున్నతీరు...

స్థానిక సంస్థల ఎన్నికల...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల...

టీటీడీ పై విజయసాయిరెడ్డి...

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పునర్వ్యవస్థీకరణ,...

గాల్లోనే విమానంపై పడ్డ...

ఆకాశంలో ప్రయాణిస్తున్న ఒక విమానంలో ప్రయాణికులకు...

రాజకీయాల్లోకి యంగ్ హీరో...

తమిళనాట సినీ గ్లామర్‌కు, రాజకీయాలకు ఎప్పుడూ...

ప్లాస్టిక్ కరెన్సీ రెడీ.....

రూ.2 వేల నోట్లు ఇప్పుడు ఎక్కడా...

పోల్స్