Saturday, October 10, 2026 12:36 PM
Saturday, October 10, 2026 12:36 PM

విశాఖ బ్రాండ్ మార్పు.. ఇక ఏఐపట్నం..!

హైదరాబాద్‌కు సైబరాబాద్ ఉన్నట్లు విశాఖకు ఇప్పుడు ఢిల్లీలో ఏఐపట్నం అని పిలుస్తున్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా అదే అన్నారు. దీనివల్ల ఇంజనీరింగ్ కాలేజీలు, స్కిల్ యూనివర్సిటీలు ఇక్కడికి రాక తప్పదు. 1 గిగా వాట్ అంటే విశాఖ నగరం మొత్తం వాడే కరెంటు. దాని కోసం గ్రీన్ ఎనర్జీ పార్కులు, కొత్త సబ్ స్టేషన్లు, సముద్రపు నీటిని చల్లబరచడానికి వాడే టెక్నాలజీ, మూడు కొత్త సబ్ సీ కేబుల్స్ విశాఖ తీరానికి వస్తున్నాయి. ఇది భవిష్యత్తులో స్టార్టప్ లకు బంగారం.

ఒకప్పుడు విశాఖ అంటే స్టీల్ ప్లాంట్, పోర్టు, ఫిషింగ్ హార్బర్. ఇప్పుడు అదే తీరంలో సముద్రం కింద నుండి వచ్చే ఆప్టికల్ ఫైబర్ కేబుల్, పైన వచ్చే గిగావాట్ కరెంటు రెండూ కలిసి విశాఖ రూపు రేఖలనే మారుస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో పెద్ద బాంబు పడింది. ఆసియాలోనే అతిపెద్ద ఏఐ హబ్ విశాఖలో 1 గిగావాట్ ఏ ఐ డేటా సెంటర్ క్యాంపస్. 2026 – 2030 మధ్య 5 ఏళ్లలో 15 బిలియన్ పెట్టుబడి అని అధికారిక ప్రకటన. ఇది గూగుల్‌కు అమెరికా బయట అతి పెద్ద డేటా సెంటర్ అవుతుంది. తర్లవాడ, అడివివరం, కాపులుప్పాడ, మధురవాడ చుట్టూ దీనికి 4800 ఎకరాలు కేటాయింపు జరిగింది. ఏప్రిల్ 2026 నుండే కన్స్ట్రక్షన్ మొదలైంది.

Also Read : గెలుపు కాదు.. ఓట్లు చీల్చడమే ఏకైక టార్గెట్..!

తాజాగాలో విశాఖలోనే మరో 1 గిగా వాట్ ఏఐ హబ్ రెడీ. దీని విలువ రూ.98 వేల కోట్లు అని ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. కంపెనీ 11 బిలియన్ పెట్టుబడి పెట్టేందుకు రెడీ అని ప్రకటించింది. దీనికి కూడా 400 ఎకరాలు అచ్యుతాపురం, ఆనందపురం వైపు ఇచ్చారు. ఇతరులు ఆదాని కాన్సెప్ట్ విడిగా కూడా 300 మెగావాట్, డేటా సెంటర్ హోల్డింగ్స్ జగన్నాధపురంలో 486 మెగావాట్, ఎంఏఐ ఫ్యాక్టరీ 512 మెగావాట్ గ్రీన్ ఏఐ సెంటర్ అని ప్రకటించాయి. మొత్తం కలిపి రూ.2.8 లక్షల కోట్ల పైగా ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి. ఇది ఉద్యోగాల వర్షం కాదు, ఉద్యోగాల పంట. డేటా సెంటర్‌లో 1,200 – 1,500 మందే ఉంటారు. కానీ అసలు లెక్క పరోక్ష ఉద్యోగాలు. గూగుల్ ప్రాజెక్ట్ వల్లనే 1.88 లక్షల ఉద్యోగాలు, ఏటా జీఎస్‌టీపీకి రూ.10,500 కోట్లు వస్తాయని అంచనా. వాటితో పాటు సిమెంట్, స్టీల్, ఎలక్ట్రిషియన్లు, ఫైబర్ లేయింగ్, సెక్యూరిటీ, క్యాంటీన్, ట్రాన్స్‌పోర్ట్, చిన్న వర్క్ షాపులు అదనం.

1 గిగా వాట్ డేటా సెంటర్ నిర్వహణకు రోజుకు లక్షల లీటర్ల నీరు, వందల మెగావాట్ల కరెంటు అవసరం అవుతుంది. ప్రభుత్వం 25 శాతం భూమి డిస్కౌంట్, కరెంటు రాయితీ ఇస్తోంది. తార్లవాడలో అసైన్డ్ భూములకు ఎకరానికి రూ.40 లక్షలు చొప్పున పరిహారం అందిస్తోంది ప్రభుత్వం. ఇక రూ.58 వేల కోట్లు పెట్టి 1,250 డైరెక్ట్ ఉద్యోగాలు అంటే ఒక ఉద్యోగానికి రూ.47 కోట్లు కేటాయింపు. ఇవి మన పిల్లలకు వచ్చే సాధారణ ఉద్యోగాలు కావని.. ఐఐటీ, హై-స్కిల్డ్ నెట్‌వర్క్ ఇంజనీర్లకు మాత్రమే అనే ప్రచారం కూడా ఉంది.

Also Read : ల్యాండ్ రోవర్ డిఫెండర్ లుక్‌తో JSW కాంబట్..!

మరో విషయం సముద్రం పక్కన ఇంత వేడిని వదిలే భవనాలు వస్తే, స్థానికంగా ఉష్ణోగ్రత 1–2 డిగ్రీలు పెరిగే రిస్క్ ఉంది. కంపెనీలు 100 శాతం గ్రీన్ అంటున్నా అది పూర్తిగా జరగడానికి 5 నుంచి 7 ఏళ్లు పడుతుంది. అనందపురం, మధురవాడ, కాపులుప్పాడ పరిసరాల్లో భూమి రేటు అమాంతం పెరిగిపోయింది. గూగుల్ ప్రకటన తర్వాత ఉత్తర విశాఖ బంగారమైంది. కొమ్మాది, మధురవాడ, ఆనందపురం, భీమిలిలో 30 నుంచి 50 శాతం పెరిగింది. ఎకరం రూ.2.5 కోట్లు ఉండేది ఇప్పుడు రూ.5 – 6 కోట్లు. ప్లాటు గజం రూ.10,000 నుండి రూ.30,000 దాటింది. ముందు కొన్నవారికి లాభం, ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలనుకునే మధ్య తరగతికి ఇది భారం. అందుకే విశాఖ ఇప్పుడు హారిజాంటల్ కాదు. వర్టికల్ అపార్ట్‌మెంట్ సిటీ అవుతోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

సచివాలయ ఉద్యోగుల గుండెల్లో...

ఇటీవల విజయవాడలో ఆందోళన నిర్వహించిన గ్రామ,...

గెలుపు కాదు.. ఓట్లు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్టీల సందడి...

మందులకు లొంగని మలేరియాకు...

వైద్య రంగంలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ...

బ్రేకింగ్: రేపు ఏపీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల...

ఏపీలో స్థానిక ఎన్నికలకు...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు...

తాడేపల్లి ప్యాలెస్‌కు సజ్జల...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల్లో...

పోల్స్