Saturday, October 10, 2026 01:30 PM
Saturday, October 10, 2026 01:30 PM

సచివాలయ ఉద్యోగుల గుండెల్లో రైళ్ళు.. అసలేం జరుగుతోంది..?

ఇటీవల విజయవాడలో ఆందోళన నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. పోలీసుల ఆంక్షలు, హెచ్చరికలను లెక్కచేయకుండా ఛలో విజయవాడ నిరసన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న ఉద్యోగులపై సర్కార్ కొరడా ఝళిపించింది. ఈ నిరసన ప్రదర్శనలో క్రియాశీలకంగా వ్యవహరించిన స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులపై అధికార యంత్రాంగం శాఖాపరమైన చర్యలు ప్రారంభించింది.

Also Read : విశాఖ బ్రాండ్ మార్పు.. ఇక ఏఐపట్నం..!

ఈ ఆందోళన కార్యక్రమాలను ముందుండి నడిపించడంలో, తోటి ఉద్యోగులను సమీకరించడంలో కీలక పాత్ర పోషించిన జేఏసీ ప్రతినిధులకు ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. నిబంధనలను ఉల్లంఘించి నిరసనల్లో పాల్గొన్న వివిధ జిల్లాలకు చెందిన 18 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అంతేకాకుండా, విధుల్లో నిర్లక్ష్యం వహించి, ప్రభుత్వ ఆంక్షలను ధిక్కరించిన ఇద్దరు ఉద్యోగులపై తక్షణమే సస్పెన్షన్ వేటు వేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అనుమతి లేని ఈ నిరసన ప్రదర్శనలో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరు ఉద్యోగులను రెచ్చగొట్టారనే అంశాలపై పోలీసు ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రత్యేకంగా నిఘా పెట్టాయి.

Also Read : గెలుపు కాదు.. ఓట్లు చీల్చడమే ఏకైక టార్గెట్..!

వారు సేకరించిన వివరాలు, నివేదికల ఆధారంగానే ఆయా జిల్లాల కలెక్టర్లు సదరు ఉద్యోగులపై చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. షోకాజ్ నోటీసులు అందుకున్న ఉద్యోగులు ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. తమ న్యాయమైన డిమాండ్ల కోసమే నిరసన తెలిపామని ఉద్యోగులు చెప్తున్నా.. అక్కడ జరిగిన చర్యలు మాత్రం వివాదాస్పదంగా మారాయి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

తిరుమల నడక దారి...

తిరుమల కొండకు కాలిబాటన వచ్చే భక్తుల...

విశాఖ బ్రాండ్ మార్పు.....

హైదరాబాద్‌కు సైబరాబాద్ ఉన్నట్లు విశాఖకు ఇప్పుడు...

గెలుపు కాదు.. ఓట్లు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్టీల సందడి...

మందులకు లొంగని మలేరియాకు...

వైద్య రంగంలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ...

బ్రేకింగ్: రేపు ఏపీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల...

ఏపీలో స్థానిక ఎన్నికలకు...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు...

పోల్స్