Saturday, October 10, 2026 01:52 PM
Saturday, October 10, 2026 01:52 PM

తిరుమల నడక దారి భక్తులకు టీటీడీ వార్నింగ్..!

తిరుమల కొండకు కాలిబాటన వచ్చే భక్తుల రక్షణ విషయంలో టీటీడీ అలెర్ట్ అయింది. ఇటీవలి కాలంలో అలిపిరి నడక మార్గంలో చిరుతల సంచారం ఎక్కువైన నేపధ్యంలో కీలక ప్రకటన చేసింది దేవస్థానం. ప్రస్తుతం అడవిలో వన్యప్రాణుల సంతానోత్పత్తి సమయం కావడంతో కొండపై చిరుతల కదలికలు బాగా పెరిగాయి. ముఖ్యంగా గాలిగోపురం నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు ఉన్న దారిలో చిరుతల సంచారం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పటిష్ట చర్యలు చేపట్టారు.

Also Read : 3 జిల్లాలు.. 3 స్థానాలు.. 3 పార్టీలు..!

చిరుతలు పొదల్లో పొంచి ఉండి భక్తులపై దాడి చేయకుండా ఉండేందుకు వీలుగా నడకదారికి ఎడమవైపున దాదాపు 25 మీటర్ల మేర ఉన్న పొదలు, గడ్డి, ఇతర వ్యర్థాలను అటవీశాఖ సిబ్బంది పూర్తిగా తొలగించారు. దాదాపు రెండు కిలోమీటర్ల పొడవునా వ్యూ లైన్స్ క్లియర్ చేయడంతో, సుదూరం నుంచే వన్యప్రాణుల కదలికలను సులభంగా గుర్తించే అవకాశం ఏర్పడింది. భక్తులకు మార్గంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా అటవీ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వన్యప్రాణుల కదలికలపై నిఘా పెట్టేందుకు టీటీడీ ఈసారి అత్యాధునిక సాంకేతికతను వాడుతోంది.

Also Read : విశాఖ బ్రాండ్ మార్పు.. ఇక ఏఐపట్నం..!

దట్టమైన చీకటి, పొగమంచులో కూడా పనిచేసే ఏఐ, థర్మల్ కెమెరాలు కలిగిన రోబో డాగ్ ను ప్రయోగాత్మకంగా రంగంలోకి దించారు. అడవిలో మనుషులు వెళ్లలేని ప్రమాదకరమైన ప్రాంతాల్లోకి ఇది వెళ్లి, చిరుతల జాడను కనిపెట్టి వెంటనే కంట్రోల్ రూమ్‌కు అలర్ట్స్ పంపుతుంది. ఇందులోని సైరన్ సౌండ్ సిస్టమ్స్ ద్వారా వన్యప్రాణులను భయపెట్టి అడవిలోకి తరిమేలా దీనిని డిజైన్ చేశారు. చిరుతల ముప్పు నేపథ్యంలో చిన్న పిల్లలతో వచ్చే భక్తుల కోసం ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తున్నారు. 10 ఏళ్ల లోపు వయసున్న పిల్లలకు మధ్యాహ్నం 3 గంటల వరకే నడక మార్గంలో అనుమతి ఉంటుంది. చంటిపిల్లలను, చిన్న పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వదలొద్దని, ఎప్పుడూ చేయి పట్టుకునే నడవాలని మైకుల ద్వారా నిరంతరం విజ్ఞప్తి చేస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా సాయంత్రం 6 గంటలకల్లా నడక మార్గాన్ని పూర్తిగా మూసివేస్తున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

సచివాలయ ఉద్యోగుల గుండెల్లో...

ఇటీవల విజయవాడలో ఆందోళన నిర్వహించిన గ్రామ,...

విశాఖ బ్రాండ్ మార్పు.....

హైదరాబాద్‌కు సైబరాబాద్ ఉన్నట్లు విశాఖకు ఇప్పుడు...

గెలుపు కాదు.. ఓట్లు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్టీల సందడి...

మందులకు లొంగని మలేరియాకు...

వైద్య రంగంలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ...

బ్రేకింగ్: రేపు ఏపీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల...

ఏపీలో స్థానిక ఎన్నికలకు...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు...

పోల్స్