Wednesday, September 23, 2026 08:06 PM
Wednesday, September 23, 2026 08:06 PM

టాలీవుడ్ కు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..!

తెలుగు చలనచిత్ర మరియు టెలివిజన్ రంగాలకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన ప్రతిష్ఠాత్మక ‘నంది ఫిల్మ్ అండ్ టీవీ అవార్డుల’ ప్రదానోత్సవాన్ని మళ్లీ వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో మంగళవారం జరిగిన ఒక సమావేశంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ అవార్డుల పునరుద్ధరణపై అధికారికంగా ప్రకటించారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ల దిశానిర్దేశం మేరకు ఈ అవార్డుల వేడుకలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రీ-లాంచ్ చేయబోతున్నట్లు మంత్రి వెల్లడించారు.

Also Read : కళ్లెదుటే టీచర్లపై దాడి జరుగుతుంటే నిఘా వ్యవస్థ ఏమైంది..?

గతంలో ప్రకటించి, వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన 2012 నుండి 2016 వరకు నంది ఫిల్మ్ మరియు టీవీ అవార్డులను యథాతథంగా విజేతలకు అందజేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఆ తర్వాత కాలానికి సంబంధించి.. అంటే 2017 నుండి 2024 వరకు సంవత్సరానికి 4 అవార్డుల చొప్పున (2 ప్రొడక్షన్ అవార్డులు, 2 స్పెషల్ జ్యూరీ అవార్డులు) ఫిల్మ్ అండ్ టీవీ విభాగాల్లో ప్రత్యేకంగా బహూకరించనున్నారు. దీనివల్ల గత ఎనిమిదేళ్లుగా అవార్డుల కోసం ఎదురుచూస్తున్న సినీ, టెలివిజన్ రంగాల కళాకారులకు మరియు సాంకేతిక నిపుణులకు ఎట్టకేలకు న్యాయం జరగనుంది.

Also Read : గులాబీ కోటలే రేవంత్ టార్గెట్..!

మరోవైపు, నూతన సంవత్సరానికి సంబంధించిన 2025 నంది ఫిల్మ్, టీవీ అవార్డుల ప్రధానోత్సవ వేడుకలను ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి వేదికగా అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. గత ప్రభుత్వం నంది అవార్డులను పూర్తిగా అటకెక్కించడంతో తీవ్ర నిరాశకు గురైన చిత్ర పరిశ్రమ, ప్రస్తుత కూటమి ప్రభుత్వ నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోంది. తెలుగు సినిమా వైభవాన్ని చాటిచెప్పేలా, కళాకారులను ప్రోత్సహించేలా రాబోయే రోజుల్లో ఈ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

శీనన్న.. ఇలా అడ్డంగా...

తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్నాయి....

ఖైరతాబాద్.. గులాబీ పార్టీకి...

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత...

ఏపీ పోలీసులకు జగన్...

రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల...

బ్రేకింగ్: విజయసాయి రెడ్డి...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన...

ఏపీలో గర్భిణీలకు తీపి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాతాశిశు ఆరోగ్య సంరక్షణను...

ఎవడు ఆపినా ఎన్నికలు...

ఏపీ కేబినేట్ భేటీ సందర్భంగా మంత్రులతో...

పోల్స్