Friday, November 6, 2026 06:13 PM
Friday, November 6, 2026 06:13 PM

కళ్లెదుటే టీచర్లపై దాడి జరుగుతుంటే నిఘా వ్యవస్థ ఏమైంది..?

విజయవాడ నగరంలో మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులపై జరిగిన దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తమకు న్యాయం చేయాలంటూ శాప్ కార్యాలయానికి వచ్చిన ఉపాధ్యాయులను లక్ష్యంగా చేసుకుని, వైసీపీ శ్రేణులు కోడిగుడ్లు, రాళ్లు, కర్రలతో దాడికి తెగబడటం పట్ల రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ దారుణ ఘటనకు సంబంధించి ప్రతిపక్షంపై విమర్శలు ఒకవైపు వస్తుండగా, అంత నడిరోడ్డుపై దాడి జరుగుతుంటే శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం, ప్రభుత్వ నిఘా విభాగం ఏం చేస్తుందనే ప్రశ్నలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి.

Also Read : అక్కడ హిట్.. కానీ.. ఇక్కడ మాత్రం..!

ఇంత భారీ స్థాయిలో వైసీపీ శ్రేణులు, పలువురు నేతలు గ్రూపులుగా చేరి, కర్రలు, రాడ్లు, కోడిగుడ్లతో పక్కా ప్లాన్ ప్రకారం దాడికి వస్తున్నారనే సమాచారాన్ని ముందే పసిగట్టడంలో రాష్ట్ర నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. నగరానికి ఇతర జిల్లాల నుండి రౌడీషీటర్లు తరలివస్తున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ, వారిని ముందే అడ్డుకోవడంలో ఇంటెలిజెన్స్ ఎందుకు అలసత్వం వహించిందనేది అంతుచిక్కడం లేదు. ఒక సున్నితమైన సమస్యపై ఉపాధ్యాయులు, రాజకీయ పార్టీల నేతలు ఒకే చోట గుమికూడుతున్నప్పుడు రాబోయే ఉద్రిక్తతలను అంచనా వేయలేకపోవడం నిఘా విభాగం వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది.

విజయవాడ పోలీస్ కమిషనరేట్, ప్రధాన పోలీస్ కార్యాలయాలకు కూతవేటు దూరంలో, బందరు రోడ్డు వంటి అత్యంత కీలకమైన ప్రాంతంలో ఇంతటి దారుణం జరిగినా పోలీసులు సకాలంలో స్పందించలేకపోయారనే ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ ముఠాలు బారికేడ్లు ఎక్కి వీరంగం సృష్టిస్తూ, టీచర్లపై భౌతిక దాడులకు దిగుతున్నా సరే, అక్కడ మోహరించిన సిబ్బంది వారిని సమర్థవంతంగా అడ్డుకోలేకపోయారు. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు తగినంత అదనపు బలగాలను ముందే రంగంలోకి ఎందుకు దించలేదన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్నగా మారింది.

Also Read : వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌ మాస్‌ వార్నింగ్‌..!

సమాజంలో అత్యంత గౌరవప్రదమైన స్థానంలో ఉండే ఉపాధ్యాయులపై, అదీ వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన వారిపై నడిరోడ్డుపై దాడులు జరుగుతుంటే వారికి కనీస రక్షణ కరువైంది. దాడి జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న శాప్ సిబ్బంది టీచర్లను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ, గూండాల దాడిని ఆపలేకపోయారు. విద్యాబుద్ధులు నేర్పే గురువులపై ఇలాంటి ఉన్మాద దాడులు జరుగుతుంటే ప్రభుత్వం శాంతిభద్రతల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అయితే, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కేవలం దాడులు జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం మాత్రమే సరిపోదని, ముందే నిఘా వ్యవస్థను పటిష్టం చేసి శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

అసెంబ్లీ కంటే ఘోరం.....

ఏపీలో మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు...

ఓటర్లకు ఈసీ బిగ్...

ఓటర్ల జాబితా నుంచి పేర్లు గల్లంతైన...

అనంతపురంలో ఏం జరుగుతోంది.....

తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా భావించే అనంతపురం...

పోలవరం ఇప్పట్లో కష్టమేనా..?...

ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు...

గుంటూరులో అర్ధరాత్రి హైడ్రామా.....

గుంటూరు సమీపంలోని నల్లపాడు వద్ద స్థానిక...

ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసు.....

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1...

పోల్స్