Friday, October 9, 2026 08:09 PM
Friday, October 9, 2026 08:09 PM

మందులకు లొంగని మలేరియాకు విరుగుడు.. జెఎన్‌యు అద్భుత ఆవిష్కరణ..!

వైద్య రంగంలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సరికొత్త చరిత్ర సృష్టించారు. దశాబ్దాలుగా మానవాళిని పీడిస్తున్న, సాధారణ మందులకు లొంగకుండా మొండిగా మారుతున్న మలేరియా, కాల అజార్ వ్యాధులను అంతం చేసే ఒక అద్భుతమైన మార్గాన్ని కనుగొన్నారు. ప్రసిద్ధ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఆనంద్ రంగనాథన్, ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం ల్యాబ్ ప్రయోగాలలో విజయవంతమైన ఫలితాలను సాధించింది. సాధారణంగా వ్యాధి కారక క్రిములను టార్గెట్ చేసే పాత పద్ధతులకు భిన్నంగా.. మన శరీరంలోని ఒక నిర్దిష్ట ప్రోటీన్‌ను వేరు చేయడం ద్వారా ఈ ఘనత సాధించారు.

Also Read : హౌతీల ఎఫెక్ట్.. భారత్‌లో పెట్రోల్ మంటలు తప్పవా..?

ఈ పరిశోధన ప్రకారం.. మలేరియా మరియు కాల అజార్ వ్యాధి కారక పరాన్నజీవులు మన శరీరంలో పెరగడానికి, బ్రతకడానికి ‘p38-MAPK’ అనే ఒక మానవ ప్రోటీన్ ఎంతగానో సహాయపడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రోటీన్‌ను కేవలం స్విచ్ ఆఫ్ చేస్తే పరాన్నజీవులు లొంగడం లేదు, కానీ ‘PROTAC’ సాంకేతికత ద్వారా ఈ ప్రోటీన్‌ను పూర్తిగా ధ్వంసం చేసినప్పుడు మలేరియా, కాల అజార్ క్రిములు శరీరంలో వృద్ధి చెందలేక బలహీనపడిపోతున్నట్లు ల్యాబ్ సెల్స్ ప్రయోగాలలో తేలింది. మన సొంత కణాలనే వ్యాధి క్రిములకు అనుకూలంగా లేకుండా మార్చడం ఈ సరికొత్త చికిత్స యొక్క ముఖ్య ఉద్దేశం.

Also Read : బ్రేకింగ్: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం..!

ప్రస్తుతం కాల అజార్ చికిత్సకు వాడుతున్న యాంఫోటెరిసిన్ బి అనే మందుతో పాటు, కొత్తగా కనుగొన్న మాలిక్యూల్ ‘NR-7h’ ను కలిపి పరీక్షించగా.. అవి విడివిడిగా కంటే కలిసికట్టుగా పరాన్నజీవులను అత్యంత సమర్థవంతంగా క్లియర్ చేసినట్లు పరిశోధకులు వెల్లడించారు. దీనివల్ల భవిష్యత్తులో రోగులకు ఇచ్చే మందుల డోసేజ్ తగ్గించవచ్చని, తద్వారా సైడ్ ఎఫెక్ట్స్, చికిత్స ఖర్చు కూడా భారీగా తగ్గుతుందని ప్రొఫెసర్ ఆనంద్ రంగనాథన్ తెలిపారు. ఈ పరిశోధన గనుక పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. వ్యాధి క్రిములు మందులకు తట్టుకునే శక్తిని కోల్పోతాయని, ఇది వైద్య రంగంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

గెలుపు కాదు.. ఓట్లు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్టీల సందడి...

బ్రేకింగ్: రేపు ఏపీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల...

ఏపీలో స్థానిక ఎన్నికలకు...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు...

తాడేపల్లి ప్యాలెస్‌కు సజ్జల...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల్లో...

హౌతీల ఎఫెక్ట్.. భారత్‌లో...

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి....

టీడీపీకి తలనొప్పిగా అనంతపురం...

అధికారంలో ఉన్న టీడీపీకి.. అనంతపురం అర్బన్...

పోల్స్