టాలీవుడ్ స్టార్ హీరో నాని నటించిన తాజా చిత్రం ది ప్యారడైజ్ ప్రీమియర్ షోల నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ పెద్దల నుంచి సానుకూల స్పందన లభించింది. ఈ సినిమా ప్రత్యేక ప్రీమియర్ షోలకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ హీరో నాని, సిఎం రేవంత్ రెడ్డితో పాటు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయగా.. సిఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులకు ప్రత్యేక ప్రదర్శనలు వేయడం ద్వారా పాజిటివ్ టాక్ వస్తుందని, అందుకే ఈ అనుమతులు ఇవ్వాలని ఆయన కోరారు.
Also Read : జగన్‌కు ఊహించని షాక్ ఇస్తున్న లోకేష్..!
చిత్ర యూనిట్ చేసిన ఈ విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోవడంపై సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. చిత్ర పరిశ్రమలో, నాని అభిమానుల్లో ఈ సినిమా ప్రీమియర్ షోలపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక నానీ రిక్వస్ట్ పై సోషల్ మీడియాలోనే రేవంత్ అనుమతులు ఇవ్వడం గమనార్హం. ప్రభుత్వ భద్రతా మార్గదర్శకాలను, పోలీసు నిబంధనలను గౌరవిస్తూ, ముందస్తు అనుమతుల కోసం బాధ్యతాయుతంగా వ్యవహరించినందుకు నానికి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
Also Read : బ్రేకింగ్: వైసీపీ కీలకనేతలపై రౌడీ షీట్ లు..!
సినిమా ప్రదర్శనల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చే ఇలాంటి ప్రీమియర్ షోల విషయంలో భద్రతా ప్రమాణాలను పాటించడం అత్యంత అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు. బాధ్యతాయుతమైన సినీ నటుడిగా నాని వ్యవహరించిన తీరును తెలంగాణ ప్రభుత్వం అభినందించిందని చిత్ర వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రీమియర్ షోల అనుమతి ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి చర్యలకు మార్గం సుగమం చేశారు. స్థానిక పోలీసు అధికారులతో, శాంతిభద్రతల విభాగంతో చిత్ర యూనిట్ సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

